అమరావతి, : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై సందిగ్థత కొనసాగుతోంది. ఈనెలాఖరులోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించాల్సి ఉంది. కానీ పరిస్థితులు చూస్తుంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నెల 31 లోపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమా ఖర్చులు రాష్ట్ర శాసనసభ ముందు పెట్టి ఆమోదించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వం ముందు ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సమావేశాలు నిర్వహించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మరో వారంలో సమావేశాలు ఏర్పాటు- చేయాల్సి ఉంది. ఇటు- తిరుపతి ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఓ కారణంగా వినిపిస్తోంది. ఈ తతంగం అంతా పూర్తికావాల్సి ఉంది. ఈ హడావిడితో
పాటు బడ్జెట్‌కు అంత సమయం కూడా లేకపోవడంతో.. ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అకౌంట్‌కు ఆమోద్ర ముద్ర వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్‌కు సంబంధిత ఆర్డినెన్స్‌ను వారంలోపు రాష్ట్ర కేబినెట్ ఆమోదించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపుతారు. మే లేదా జూన్‌లో శాసనసభ సమావేశాలు నిర్వహించి.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆమోదించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. గతేడాది కూడా మార్చిలో కరోనా ప్రభావంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు.
ఓట్ ఆన్ బడ్జెట్ కే ఎపి ప్రభుత్వం మొగ్గు..
Advertisement
తాజా వార్తలు
Advertisement