Thursday, November 21, 2024

మంత్రి పెద్దిరెడ్డి ,తనయుడు ఎంపీ మిదున్ నాయకత్వం భేష్..

మదనపల్లి – రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు ఎంపీ మిదున్ రెడ్డి ల నాయకత్వం చిత్తూర్ జిల్లాలో భేష్ అని 9 వ వార్డ్ కౌన్సిలర్ పాల్ చంద్రశేఖర్ అన్నారు..మదనపల్లి లో 33 వార్డ్ లు వైసీపీ విజయం సాధించడం వెనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఆయన తనయుడు ఎంపీ మిదున్ రెడ్డి ల వ్యూహం వల్లే ఈ అద్భుత0 సాధ్యపడిందని కితాబిచ్చారు.. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా వైసీపీ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆహా రాత్రులు శ్రమించారని ఆయన కృషి ప్రశంసనీయం అన్నారు..వాయిస్ ఆఫ్ ది పీపుల్ జింకా వెంకట చలపతి ప్రజల అభిమానాన్ని చొరగొన్నారని తెలిపారు.. జింకా వెంకట చలపతి,ఫైర్ బ్రాండా మహిళ నాయకురాలు షమీమ్ అస్లాం , కిరణ్ కుమార్ రెడ్డిలు 35 వార్డు లలో విజయం సాధించడానికి వారు చేసిన కృషి కి
ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. అయితే 33 వార్డుల్లో ప్రజలు వైసీపీ పార్టీకి అనుకూలంగా తీర్పు ను ఇవ్వడం హర్షణీయం అన్నారు..రాష్ట్ర వైసీపీ కో ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ సేవలు అభినందనీయమన్నారు.. మదనపల్లి లో వైసీపీ గెలుపొందడం వెనుక సీనియర్ పాత్రికేయులు బండపల్లి అక్కులప్ప కృషి కూడా ఉందని ఆయన్ను ప్రశంసలు కురిపించారు.. అదే విదంగా సీపీ సుబ్బారెడ్డి, అడివిలో పల్లి గోపాల్ రెడ్డి ,సాయి ప్రసాద్ రెడ్డి ,పార్టీ అభ్యర్థుల విజయానికి దోహద పడ్డారన్నారు..మదనపల్లి లో వైసీపీ పార్టీ పాలక మండలి ఏర్పాటు కావడంతో 9 వ వార్డ్ ను మోడల్ వార్డ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు.. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా వ్యూహం వల్ల బలిజ,ముస్లిం, మైనార్టీ ఎస్సి,ఎస్టీలు వైసీపీ కి అనుకూలంగా ఓట్లు వేశారని అన్నారు..అందువల్ల 33 వార్డుల్లో గెలుపు సాధ్యపడిందని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వర్ణయుగం తెచ్చారని ప్రశంసించారు.. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వైసీపీ గెలుపొందడం వెనక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు వల్లే ఇది సాధ్యపడిందని పేర్కొన్నారు.. రాజంపేట ఎంపీ మిదున్ రెడ్డి అభ్యర్థులను ఎంపిక చేయడం లో కీలకంగా వ్యవహరించారని కొనియాడారు.. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీ ల పాత్ర మరువలేనిది గా అభివర్ణించారు.. మదనపల్లి లో వైసిపి చైర్మన్ ఆధ్వర్యంలో మదనపల్లి లో స్వరం యుగం మొదలవ్వడం ఖాయమన్నారు.. మదనపల్లి లో వైసీపీ పక్షాన నిలబడిన వేలాదిమంది ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement