తిరుపతి సిటీ : తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం స్పందన కార్యక్రమం సందర్భంగా భార్య భర్తలు పురుగుల మందు తాగే యత్నం చేశారు. అపరిమాతమైన కలెక్టరేట్ సిబ్బంది వారిని రుయా హాస్పిటల్ తరలించారు. సూళ్లూరుపేట సాయి నగర్ కి చెందిన దంపతులు సూళ్లూరుపేట తాసిల్దార్ కి చిట్టమూరు మండలం ఉప్పల మద్ది గ్రామంలో ఉన్న తమ పొలాలకు పాస్ పుస్తకాలు జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు. కార్యాలయం చుట్టూ తిరిగినా ఇప్పటి వరకు స్పందించలేదని ఆరోపించారు. సంవత్సరాల తరబడి తమ సమస్యకు పరిష్కారం చూపలేదని, పాస్ పుస్తకాలు జారీ చేయడానికి రెవెన్యూ అధికారులు డబ్బులు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతు తీసుకుని వచ్చిన బ్లేడ్ తో చేతిని కోసుకోగా ఆయన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ముఖ్యమంత్రికి, కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన పాస్ పుస్తకాలు జారీ చేయలేదన్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తనకు అన్యాయం జరిగిందని ఆసుపత్రులైన చనిపోతానని, నాకు జరిగిన అన్యాయం మరొకరి జరగకూడదని అని కంటతడి పెట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement