Friday, November 22, 2024

25 ఏళ్లగా ముక్కంటి సేవలో తరిస్తున్న స్కౌట్స్ అండ్ గైడ్స్

శ్రీకాళహస్తి – దక్షిణ కాశీ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో గత 25 సంవత్సరాలుగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తమ స్వచ్చంధ సేవలను అందిస్తున్నారు. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. 13 రోజులు పాటు నిర్వహించే ఈ ఉత్సవాలులో మహాశివరాత్రి రధోత్సవం, తెప్పోత్సవం, స్వామి అమ్మవార్లు కళ్యాణోత్సవం అతి ముఖ్యమైనవి, ముఖ్య రోజులులో స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. భక్తులు సేవ కోసం 1996 సంవత్సరం 2021 వరకు 26 సంవత్సరాలు నుండి రోవర్ స్కౌట్ లీడర్ టి రమేష్ బాబు సారథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలో చదివే 200 మంది స్కౌట్స్, అండ్ గైడ్స్, రోవర్లు, రేంజర్లు 3 రోజులు పాటు పాల్గొని భక్తులుకు తమ స్వచ్ఛంధ సేవలందిస్తున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఆలయంలో భక్తులు క్యూలైన్ల క్రమబద్దీకరణకు సహాయపడుతారు. అలాగే చిన్నపిల్లలుకు పాలు, బిస్కెట్లు, మంచినీరు పంపిణీ చేస్తారు. స్వామి అమ్మవార్లు రధోత్సవం సందర్భంగా భక్తులును రోప్ లు సహాయంతో రధ చక్రాలు వద్దకు రానివ్వకుండా చేస్తారు. తెప్పోత్సవం జరుగుతున్న సమయంలో కోనేరు వద్ద భక్తులు ముందుగా ఉండి ఎవ్వరూ నోటిలోకి దిగకుండా చర్యలు తీసుకుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా స్విమింగ్ రోవర్లను ఏర్పాటు చేశారు. అలాగే కళ్యాణోత్సవంలో రాత్రి నుండి ఉదయం కళ్యాణ తంతు ముగిసే వరకు వేదిక వద్ద భక్తులుకు సేవలు కొనసాగించారు. ఇలా ప్రతి ఏడాది ముక్కంటికి సేవలందిస్తున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ కి దేవస్థానం భోజన బస వసతి కల్పిస్తున్నారు. సేవలో పాల్గొన్న వలంటీర్లందరికి ప్రత్యేకంగా ఈఓ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు.
2021 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలుకు సేవలందించారు. శివరాత్రి, స్వామి, అమ్మవార్ల రధోత్సవం, తెప్పోత్సవం, కళ్యాణోత్సవం ల్లో 220 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలందించారు. శివరాత్రి రోజున భక్తుల క్యూ లైన్లను క్రమబద్ధీకరణ, తాగునీరు, మజ్జిగ అందించారు. కోవిడ్ 19 నిబంధనల మేరకు ఆలయానికి విచ్చేసిన భక్తులకు శానిటైజ్ చేశారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీ బిఎస్ బాలుర ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, బాబుఅగ్రహారం మునిసిపల్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కళాశాల, తొందమనాడు జడ్పి హైస్కూల్ నుండి 220 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు అందజేశారు. రాష్ట్ర స్కౌట్ మండలి సభ్యులు టి. రమేష్ బాబు, రాష్ట్ర కార్యాలయ కమిషనర్ ఎం ఎం రెడ్డి,పర్యవేక్షణలో క్యాంప్ కోఆర్డినేటర్ గా ఎం ఉమేష్ రావు వ్యవహరించారు. లీడర్ అజారుద్దీన్ పాల్గొన్నారు. వీరిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ,ఇఓ పెద్దిరాజు ఆలయ అధికారులు సిబ్బంది అభినందనలు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement