తిరుపతి, : తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 50 వార్డులక గానూ 27 వార్డులకు పోలింగ్ జరిగింది, 22 వార్డులు ఏకగ్రీవలూకాగా, రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు ఒక వార్డు సస్పెన్షన్ లో వుందని నేడు జరిగిన కౌంటింగ్ అనంతరం 26 వార్డులలో వై ఎస్ ఆర్ సి పి , ఒక వార్డులో టిడిపి గెలుపొందాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మరియు రిటర్నింగ్ అధికారి గిరీష పి.ఎస్. తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల లో కౌంటింగ్ పూర్తి అయిన తరువాత అక్కడే ఏర్పాటుచేసిన మీడియా సెంటర్లో కమిషనర్ , తిరుపతి ఆర్డీఓ కనకనరసా రెడ్డి వివరించారు. కమిషనర్ మాట్లాడుతూ, తిరుపతికి మొదటి కార్పొరేషన్ ఎన్నిక, ఎన్నికల ప్రక్రియ అందరి సహకారంతో ప్రశాంత వాతావరణంలో జరిగిందని, మీడియా సహకారంతో ఎప్పటికప్పుడు సమస్యలు దృష్టికి తెచ్చి సహరించారని, ధన్యవాదలని నేడు కౌంటింగ్ పూర్తి అయిందని అన్నారు.
ఈ నెల 18 న కార్పొరేషన్ కార్యాలయంలోని లలితకళా ప్రాంగణంలో మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో 49 మంది కార్పొరేటర్లు (ఒక్కటి ఎస్.ఈ.సి. ఆదేశాలతో సస్పెన్షన్లోవుంది) , తిరుపతి శాసన సభ్యులు ఎక్స్ అఫిషియో మెంబర్ పాల్గొంటారని తెలిపారు. తిరుపతి ఎం.పి.స్థానం ఖాళీ, ఎం.ఎల్.సి.లు ఇక్కడ ఓటరుగా లేరని అందుకే ఎక్స్ అఫిషియో సభ్యులు ఒక్కరే వుంటారని తెలిపారు. తిరుపతి ఆర్డీఓ మాట్లాడుతూ 14 సంవత్సరాల తరువాత తిరుపతిలో ఎన్నికలు జరిగాయి, ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఎన్నికల అధికారి గిరిషా ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. జిల్లా కలెక్టర్ సూచనలతో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగాయి. కౌంటింగ్ ప్రక్రియ వెబ్ కాస్టింగ్ తో అధికారులు, మీడియా సెంటర్ ఏర్పాటుచేసి లైవ్ ఇవ్వడం జరిగింది. పోలింగ్ శాతం తగ్గడం బాధాకరమని, తిరుపతిలో రాబోవు ఏ ఎన్నికల్లో నైనా పోలింగ్ శాతం పెరగాలని ఓటర్లకు విజ్నప్తి చేస్తున్నామని, మీడియా మిత్రులు అవగాహనకు సహకరించాలని అన్నారు.
నేడు జరిగిన 27 వార్డులలో ఫలితాలు …..
వై.ఎస్.ఆర్.సి.పి. అభ్యర్థులు :
2వ వార్డు మొత్తం ఓటర్లు 6639, పోలైనవి 4467 , గెలుపొందిన అభ్యర్థి ఎం.ఉమ -ఓట్లు 2795 (ఆధిక్యత 1254)
3వ వార్డు మొత్తం ఓటర్లు 7808, పోలైనవి 4535 , గెలుపొందిన అభ్యర్థి డి.గుణశేఖర్ – ఓట్లు 2747 (ఆధిక్యత 1681)
5వ వార్డు మొత్తం ఓటర్లు 5116, పోలైనవి 2621 , గెలుపొందిన అభ్యర్థి పి.అమరనాధ రెడ్డి – ఓట్లు 1817 (ఆధిక్యత 1133)
9వ వార్డు మొత్తం ఓటర్లు 3785,పోలైనవి 2402 , గెలుపొందిన అభ్యర్థి ఎ.లీలావతి – ఓట్లు 1303 (ఆధిక్యత 348)
15వ వార్డు మొత్తం ఓటర్లు 3664, పోలైనవి 2211, గెలుపొందిన అభ్యర్థి డి.షాలిని- ఓట్లు 1563 (ఆధిక్యత 989)
16 వ వార్డు మొత్తం ఓటర్లు 4508, పోలైనవి 2424 , గెలుపొందిన అభ్యర్థి ఎం.మోహన్ కృష్ణ – ఓట్లు 1572 (ఆధిక్యత 903)
18 వ వార్డు మొత్తం ఓటర్లు 6440, పోలైనవి 3123 , గెలుపొందిన అభ్యర్థి ఎస్.సులోచన – ఓట్లు 1862(ఆధిక్యత 1000)
20 వ వార్డు మొత్తం ఓటర్లు 5716, పోలైనవి 2710 , గెలుపొందిన అభ్యర్థి పి.రాజమ్మ – ఓట్లు 1751 (ఆధిక్యత 894)
22 వ వార్డు మొత్తం ఓటర్లు 3761, పోలైనవి 1980 , గెలుపొందిన అభ్యర్థి పి.సునీత – ఓట్లు 1232 (ఆధిక్యత 531 )
23 వ వార్డు మొత్తం ఓటర్లు 3714, పోలైనవి 1568 , గెలుపొందిన అభ్యర్థి పి.అమరనాధ రెడ్డి – ఓట్లు 1225(ఆధిక్యత 908)
24 వ వార్డు మొత్తం ఓటర్లు 2928, పోలైనవి 1982 , గెలుపొందిన అభ్యర్థి ఎస్.హనుమంత నాయక్ – ఓట్లు 959 (ఆధిక్యత 87)
25 వ వార్డు మొత్తం ఓటర్లు 6178,పోలైనవి 3746 , గెలుపొందిన అభ్యర్థి కె.నరసింహాచారి – ఓట్లు 2600 (ఆధిక్యత 1730)
26 వ వార్డు మొత్తం ఓటర్లు 5675, పోలైనవి 2718 , గెలుపొందిన అభ్యర్థి టి.బీమలపతి – ఓట్లు 2092 (ఆధిక్యత 1573)
28 వ వార్డు మొత్తం ఓటర్లు 5803,పోలైనవి 3640 , గెలుపొందిన అభ్యర్థి పి.చంద్రబాబు – ఓట్లు 1789 (ఆధిక్యత 837)
29 వ వార్డు మొత్తం ఓటర్లు 5557, పోలైనవి 3073 , గెలుపొందిన అభ్యర్థి ఎ.ఆదిలక్ష్మి – ఓట్లు 2266(ఆధిక్యత 1644)
31 వ వార్డు మొత్తం ఓటర్లు 3965, పోలైనవి 2576, గెలుపొందిన అభ్యర్థి సి.కె.రేవతి – ఓట్లు 1594 (ఆధిక్యత 681)
32 వ వార్డు మొత్తం ఓటర్లు 7001, పోలైనవి 3184 , గెలుపొందిన అభ్యర్థి సి.శైలజ – ఓట్లు 2020 (ఆధిక్యత 1041)
33 వ వార్డు మొత్తం ఓటర్లు 6824, పోలైనవి 3611 , గెలుపొందిన అభ్యర్థి డి.కుమారి – ఓట్లు 2075 (ఆధిక్యత 1300)
34 వ వార్డు మొత్తం ఓటర్లు 4988, పోలైనవి 3051, గెలుపొందిన అభ్యర్థి ఎం.శ్రావణి – ఓట్లు 1478 (ఆధిక్యత 155)
39 వ వార్డు మొత్తం ఓటర్లు 4438,పోలైనవి 2204 , గెలుపొందిన అభ్యర్థి ఎన్.పునిత – ఓట్లు 1832 (ఆధిక్యత 1621)
41 వ వార్డు మొత్తం ఓటర్లు 5907 , పోలైనవి 2145 , గెలుపొందిన అభ్యర్థి పి.స్రవంతి – ఓట్లు 1570 (ఆధిక్యత 1075)
42 వ వార్డు మొత్తం ఓటర్లు 6185, పోలైనవి 2194 , గెలుపొందిన అభ్యర్థి ఎం.శేఖర్ రెడ్డి – ఓట్లు 1502 (ఆధిక్యత 979)
43 వ వార్డు మొత్తం ఓటర్లు 5820, పోలైనవి 3015 , గెలుపొందిన అభ్యర్థి ఎ.రాధ – ఓట్లు 1779 (ఆధిక్యత 723)
44 వ వార్డు మొత్తం ఓటర్లు 4995, పోలైనవి 2750 , గెలుపొందిన అభ్యర్థి వి.నారాయణ – ఓట్లు 1323 (ఆధిక్యత 397)
49 వ వార్డు మొత్తం ఓటర్లు 4539 , పోలైనవి 3298 , గెలుపొందిన అభ్యర్థి ఎ.సంధ్య యాదవ్ – ఓట్లు 2569 (ఆధిక్యత 1984)
50 వ వార్డు మొత్తం ఓటర్లు 5044, పోలైనవి 2649 , గెలుపొందిన అభ్యర్థి అనిల్ కుమార్ – ఓట్లు 1476 (ఆధిక్యత 441)
టిడిపి ….
35వ వార్డు మొత్తం ఓటర్లు 4532, పోలైనవి 2161 , గెలుపొందిన అభ్యర్థి ఆర్.సి.మునికృష్ణ – ఓట్లు 1037 (ఆధిక్యత 126)