Saturday, November 23, 2024

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త.. హైదరాబాద్‌-తిరుమల మధ్య 16 ప్రత్యేక రైళ్లు..

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి-హైదరాబాద్ మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైలు (07509) ఆగస్టు 6, 13, 20 తేదీల్లో హైదరాబాద్‌లో సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి (07510) రైలు ఆగస్టు 7, 14, 21 తేదీల్లో రాత్రి 11.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. అలాగే మరో రైలు (07433) ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో హైదరాబాద్‌లో సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుతుంది. అలాగే 07434 రైలు ఆగస్టు 3, 10, 17, 24, 31 తేదీల్లో సాయంత్రం 5.20 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. వీటితో పాటు నాందేడ్, తిరుపతి, ఔరంగాబాద్ మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొన్నది. నాందేడ్ ప్రత్యేక రైలు (07633) ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు (జూలై 31) ఉదయం 8.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 07634 ఈ నెల 31వ తేదీ రాత్రి 9.10 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 5.20 గంటలకు నాందేడ్ చేరుతుంది. మరో ప్రత్యేక రైలు ఆగస్టు 7, 14, 21 తేదీల్లో తిరుపతిలో ఉదయం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. ఔరంగాబాద్ (07638) ఆగస్టు 8, 15, 22 తేదీల్లో రాత్రి 11.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement