Wednesday, September 25, 2024

AP | టాస్క్ ఫోర్స్ దాడిలో 15 మంది “ఎర్ర” కూలీలు అరెస్ట్ !

తిరుపతి, (ప్రభన్యూస్ బ్యూరో, రాయలసీమ) : అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని సానిపాయ అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం చెట్లు నరకడానికి ప్రవేశిస్తున్న 15మందిని టాస్క్ ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేసారు. వారి నుంచి రంపాలు, గొడ్డళ్లు, నాలుగు కార్లు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ.సురేష్ బాబు సుండుపల్లి నుంచి కొలిమిమిట్టా వైపు స్థానిక అటవీశాఖ అధికారులతో కలసి కూంబింగ్ చేపట్టామ‌ని తెలిపారు. అక్కడ కొంతమంది నాలుగు కార్లలో దిగుతూ కనిపించ‌గా.. వారిని హెచ్చరించి చుట్టుముట్టామ‌ని.. అయితే, కొందరు పారిపోయే ప్ర‌య‌త్నం చేశారని వెల్ల‌డించారు.

- Advertisement -

ఈ క్ర‌మంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి 15 మందిని పట్టుకున్నట్టు పేర్కొన్నారు. ప‌ట్టుబ‌డ్డ‌ వారిలో నలుగురు అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా, 11మంది తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించామ‌ని తెలిపారు. అరెస్టు చేసిన వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించగా, సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement