చిత్తూరు – టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వంత నియోజకవర్గం కుప్పం పంచాయితీ ఎన్నికలలో పరాజయం మరిచిపోకముందే చిత్తూరు జిల్లాలో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో ఘోర ఓటమి చెందారు..జిల్లాలో ఒక్క మునిసిపాలిటీలో సైతం గట్టి పోటీని ఇవ్వలేకపోయారు.. ఇక తిరుపతి కార్పొరేషన్లో సైతం పరాజయం మూటగట్టుకున్నారు..జిల్లాలోని తిరుపతి నగర పాలకసంస్థతో సహా ఎన్నికలు జరిగిన అన్ని మునిసిపాలిటీలలోనూ వైసిపి విజయ కేతనం ఎగువేసింది..
వైసిపి గెలుచుకున్న మునిసిపాలిటీల వివరాలు
చిత్తూరు కార్పొరేషన్ వైఎస్ఆర్ సీపీ కైవసం
చిత్తూరు కార్పొరేషన్ (50): వైఎస్సార్సీపీ -46, టీడీపీ -3, ఇతరులు -1
మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
మదనపల్లె (35): వైఎస్సార్సీపీ -33, టీడీపీ -2
పుంగనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పుంగనూరు (31): వైఎస్సార్సీపీ -31, టీడీపీ -0
పలమనేరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పలమనేరు (26): వైఎస్సార్సీపీ -24, టీడీపీ -2
నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
నగరి (29):వైఎస్సార్సీపీ -24, టీడీపీ -4, ఇతరులు -1
పుత్తూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం
పుత్తూరు (27): వైఎస్సార్సీపీ -22, టీడీపీ -5
శ్రీకాళహస్తి మునిసిపాలిటీ
శ్రీకాళహస్తి – వైసిపి 28, టిడిపి 2