Friday, November 22, 2024

సౌత్ ఇండియా లెవల్ వాలీబాల్ టోర్నమెంట్ విజేత హైదరాబాద్

రొంపిచెర్ల:రొంపిచెర్ల మండలం లోని బొమ్మయ్యగారిపల్లి గ్రామపంచాయతీ లోగల ఆకాష్ ఇంగ్లీషు మీడియం హైస్కూలు గ్రౌండ్ లో సౌత్ ఇండియా లెవల్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది.రన్నరప్ గా కోలార్ జట్టు నిలిచింది. మూడవ స్థానం లో పాండిచేరి, నాలుగవ స్థానం లో వేలూరు జట్లు నిలిచాయి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన టీమ్ ల ప్రదర్శన హోరా హోరా గా సాగింది.విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు రూ. 50వేల నగదు బహుమతి,రన్నరప్ గా నిలిచిన కోలార్ జట్టుకు రూ 30వేల నగదు, మూడవ స్థానంలో నిలిచిన పాండిచేరి జట్టుకు రూ.20000,నాలుగవ స్థానం లో నిలిచిన వేలూరు జట్టుకు రూ.10వేల నగదును బహుమతులుగా అందజేశారు.అనంతరం ఆర్గనైజర్లు మాట్లాడుతూ రొంపిచెర్ల, బైరెడ్డి పల్లి, హైదరాబాద్, ఎర్రవారిపాలెం,నరసింగాపురం,బంగారుపాళ్యం, సదుం,భాకరపేట, కసిరెడ్డి గారి పల్లి, గౌస్ అకాడమీ,కొచ్చి, పాండిచేరి, చెన్నై,తిరుపతి, తిరువనంతపురం, తిరుచ్చి,కోలార్, వేలూరు,ఇంకా సుమారు 35 జట్లు ఈ పోటీలలో పాల్గొన్నాయి.సౌత్ ఇండియా లెవల్ టోర్నమెంట్ సెమీఫైనల్ లో హైదరాబాద్,కోలార్,పాండిచేరి, వేలూరు జట్లు నిలిచాయి.అందులో ఫైనల్ కు హైదరాబాద్, కోలార్ జట్లు చేరాయి. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్దఎత్తున హాజరయ్యారు. హోరా హోరీ గా సాగిన ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు, కోలార్ జట్లు మూడు సెట్ల లో మొదటి సెట్ హైదరాబాద్ జట్టు 25-20 గెలువగా,రెండవ సెట్ కోలార్ జట్టు 25-22 గెలిచింది. దీంతో మూడవ సెట్ నిర్వహించగా హైదరాబాద్ జట్టు మూడవ సెట్ ను 25-22 తో కైవసం చేసుకొని విజేతగా నిలిచింది. క్రీడాకారులు కోసం భోజన సౌకర్యం, విశ్రాంతికి వసతి సౌకర్యాలు కూడా కల్పించారు.ఉత్తమ ప్రతిభ కనపరిచిన కోలార్ క్రీడాకారుడు నవాజ్ కు, హైదరాబాద్ క్రీడాకారుడు వెంకట్ లకు నగదు బహుమతి ప్రధానం చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీరాష్ట్ర కార్యదర్శి సలీం బాష, మండల బిసి సెల్ అధ్యక్షుడు కోటా వెంకటరమణ, వైఎస్సార్సీపీ నాయకులు బరకతుల్లా, అబూబకర్,రొంపిచెర్ల సీనియర్ వాలీబాల్ ప్లేయర్స్ ఆర్గనైజర్లు షాజహాన్, అష్రఫ్,మహమ్మద్ సల్మాన్,అంజద్ ఖాన్ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement