Tuesday, November 26, 2024

సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం… ఈవో పెద్దిరాజు

శ్రీకాళహస్తీశ్వరాలయం – మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అందరి అధికారుల సమన్వయంతో ఆలయ అధికారులు సిబ్బంది బాధ్యతతో సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. శుక్రవారం ఉదయం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా అధికారులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు సమన్వయంతో సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడం ఆనందం కలిగిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. శివయ్య చెంత ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా ఎక్కడ ఎలాంటి సంఘటనకు చోటివ్వకుండా అందరి సహకారంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరి పనులు వారు గర్వంగా చేయడం జరిగిందని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బ్రహ్మోత్సవాలుకోసం సాయశక్తులా కష్టపడ్డారని అధికారులకు అభినందనలు తెలిపారు. రెవిన్యూ , పురపాలక, ట్రాన్స్కో, అగ్నిమాపక, ఆరోగ్యశాఖ, ఆర్టీవో, ఆర్టీసీ, రోడ్లు భవనాల శాఖ, ఐ సి డి ఎస్, ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియా, స్కౌట్స్, యువతరం వాలంటీర్ల సేవలు,ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని శాఖలు బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకున్నారని వారి వారి విధులు సక్రమంగా నిర్వహించడం వల్ల శివయ్య బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ధూర్జటి కళా ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ అన్ని శాఖల వాళ్లు చేపట్టాల్సిన పనులను సకాలంలో చేయడం ఆలయ అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం తో ఉత్సవాలను నిగిర్వంగా పూర్తి చేయడం జరిగిందన్నారు.భక్తులకు ఎలాంటి చిన్నపాటి సమస్యలు ఎదురుకాకుండా అన్ని ఉత్సవాలు ఘనంగా చేపట్ట గలిగానని తెలియజేశారు కొన్ని కొత్త నిర్ణయాలు అమలులోకి తీసుకు వచ్చిన ఈ సందర్భంగా సులభ దర్శనం ఎంతో ప్రాముఖ్యత చోటుచేసుకుంది అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement