శ్రీకాళహస్తీశ్వర ఆలయం – మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లు తమ కళ్యాణానికి విచ్చేసిన ముక్కోటి భక్తజన కోటికి మునులకు ఋషులకు వీడ్కోలు పలుకుతూ గిరిప్రదక్షిణ చేశారు. ఉదయం అలంకార మండపంలో పార్వతీపరమేశ్వరులు ప్రత్యేక అలంకరణలో గిరిప్రదక్షిణ కి బయలుదేరారు. ఈ సందర్భంగా పట్టణ నాలుగు మాడవీధుల్లో భక్తజన కోటికి దర్శనమిస్తూ గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఏడాదిలో రెండుసార్లు స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తుంది మొదటిది సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తారు. దీనిని కైలాసగిరిలో బంధుమిత్రులు శివరాత్రి మహోత్సవ ఆహ్వానం గా చెబుతారు శివరాత్రి అనంతరం నిర్వహించే వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులకు సాధారణంగా తీసుకెళ్లి నట్లు పురాణాలు చెబుతున్నాయి. సుమారు 14 కిలోమీటర్లు కొండలు విస్తరించడంతో కొండ చుట్టూ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు స్వామి అమ్మవారి మీద ఉన్న భక్తి భావంతో రామాపురం డ్యామ్ వద్ద యువత చిన్న పిల్లలు కుటుంబ సభ్యులు ఎంతో ఆహ్లాదకరంగా స్నానాలు ముగించుకొని స్వామి అమ్మవారు ఉత్సవాలలో పాల్గొని అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ అధికారులు లోకేష్ రెడ్డి, ధనపాల్, హరి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement