రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్ బి ఎస్ లాడ్జిలో తిరుపతికి చెందిన అనిత (31), వెంకట్ యాదవ్ ( 35) వేరువేరు రూములలో ఆత్మహత్య చేసుకున్నారు . అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు తిరుపతి నగరం సత్యనారాయణపురం కు చెందిన అనిత, వెంకట్ యాదవ్ పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ క్రమంలో అనితతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్న వెంకట్ యాదవ్ ఆమెతో సహజీవనం సాగించాడు. 2 సంవత్సరాల క్రితం ఆమెను వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వెంకట్ యాదవ్ కు ప్రమాదంలో కాలు విరగడంతో పుత్తూరు వెళ్లడానికి రేణిగుంట పట్టణంలోని ఎస్ బి ఎస్ లాడ్జిలో రెండు రోజుల క్రితం రెండు వేరు వేరు రూములు తీసుకున్నారు.మంగళవారం మధ్యాహ్నం వెంకట్ యాదవ్ తన రూమ్ లో విషం తాగి మృతి చెందగా, మరోక్క రూమ్ లో ఉన్న అనిత ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందింది. విషయాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది రేణిగుంట అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ అంజు యాదవ్ ఆధ్వర్యంలో ఎస్ఐ సునీల్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లాడ్జి తలుపులు పగలగొట్టారు. రూములో అనిత ఉరి వేసుకొని ఉండడం గమనించారు. మరో రూములో వెంకటేష్ విషం తీసుకోని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పరిశీలించిన సిఐ అంజు యాదవ్ కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు.రేణిగుంట అర్బన్ సిఐ అంజు యాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు…………. సీఐ అంజు యాదవ్
పట్టణంలో బస్టాండ్ సమీపంలోని ఎస్ బి ఎస్ లాడ్జి లో జంట ఆత్మహత్య చేసుకున్నారు. వారి వద్ద నున్న సెల్ఫోన్ ఆధారంగా విచారణ చేపట్టినట్లు సిఐ తెలిపారు. తిరుపతి పట్టణంలోని లీలామహల్ సెంటర్ వద్ద పండ్ల వ్యాపారం లో నష్టాలు రావడంతో అప్పులు అధికమైన ట్లు తెలిపారు. అప్పుల బాధ తాళలేక మృతి చెంది ఉంటారని మృతుడు చిన్నాన్న వెల్లడించినట్లు అర్బన్ సిఐ అంజు యాదవ్ తెలిపారు.