Friday, November 22, 2024

బిందు సేద్యాన్ని పరిశీలించిన నాబార్డ్ బృందం

బంగారుపాళ్యం- చిత్తూరు నాబార్డు బృందం బుధవారం మండలంలోని గుండ్లకట్టమంచి గ్రామంలో 1918-19 వ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు వారి సహకారంతో అమర్చిన బిందు సేద్యం కొరకు అమర్చిన పరికరాలను రైతు శోభ వారి మామిడితోటలో జిల్లా డీడీఎం సి.సునీల్,జిల్లా డిఎం ఎస్.శ్రీనివాసులు రెడ్డి పరిశీలించి బిందు సేద్యం వలన కలిగే ప్రయోజనాలను, కాలువలు ద్వారా సాగుకి బిందు సేద్యం వలన పంటల సాగు పై రైతు లాభాలు అనగా పెట్టుబడులు,దిగుబడులు పై రైతులను అడిగి తెలుసుకున్నారు.రైతు శోభ మాట్లాడుతూ బిందు సేద్యం వలన ఉన్న నీటితో అధిక విస్తీర్ణంలో పంట,కలుపు ల సమస్య తగ్గి తద్వారా కూలీల తగ్గుతుందని,ఎరువుల వాడకం తగ్గి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు పథక సంచాలకులు ఎస్.మురళీమోహన్ రెడ్డి,ఎం ఐ డిసి. హరినారాయణ,ఎం ఐ ఏ ఓ.శ్రావణి,ఎం ఐ. కంపెని సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement