సోమల పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు ఉదయం 9 గంటలకు ఆవుల పల్లి లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం పెద్ద ఉప్పర పల్లి ,అవులపల్లె గ్రామ పంచాయతీలలో పల్లె బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘనంగా మంగళహారతులతో, మంగళవాయిద్యాలతో, మేళ తాళముల తో, బాణసంచా కార్యక్రమాలతో పూల బాటలో ఆయనకు స్వాగతం పలికారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వము అమలు చేయని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల కాలంలో అమలు చేశారన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు, రోడ్లు అభివృద్ధిపై సర్పంచులు ప్రత్యేక దృష్టి సారిస్తే సర్పంచుల పాలన అద్భుతంగా ఉంటుందని తెలిపారు. పంచాయతీ అభివృద్ధిలో పోటీపడాలని, మార్గదర్శకంగా నిలవాలన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించాలని తెలిపారు నవరత్నాలలో ఏ పథకమైనా అర్హులైనవారికి అందని పరిస్థితుల్లో వారికి ఎందుకు అందలేదు వాలంటరీ లు తెలుసుకుని సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.ఏదైనా మీరు పరిష్కరించలేని జటిలమైన సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని నాయకులకు తెలిపారు వైయస్సార్ పార్టీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పెద్ద ఉప్పరపల్లి బస్టాండ్ లో వైసీపీ మండల కన్వీనర్ గంగాధరం రాయల్ ,జడ్పిటిసి అమాస కుసుమకుమారి మోహన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్విండో అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు ఎంపీపీ ఈశ్వరయ్య , ఏఎంసీ చైర్మన్ అరుణ నాగేశ్వరరావు ఎంపీటీసీ సర్వేశ్వరి ,ప్రభాకర , బాబు రెడ్డి, ఐలా సురేంద్ర,నాగభూషణం రెడ్డి బెంగళూరు సాంబయ్య , ప్రభాకర ,శీలం భాస్కర ,శీలం గణేష్ సర్పంచులు సర్పంచ్ భారతి గణపతి, మాజీ సర్పంచ్ బషీర్ ,మాజీ ఎంపీటీసీ జిలాని భాష ,ఆవుల పల్లి సర్పంచ్ కోదండ రాజు, కె వెంకటరమణ, , ఎంపీటీసీ నాగభూషణం రెడ్డి సాంబ శివయ్య, చిన్న మల్లయ్య, సచివాలయం సిబ్బంది వాలట్రీలు పాల్గొన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement