వెదురుకుప్పం, ప్రజలకు సుపరిపాలన అందించండంలో దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె నారాయణ స్వామి పేర్కొన్నారు. వెదురుకుప్పం మండల కేంద్రంలో సుమారు కోటి రూపాయల తో జరుగుతున్న డ్రైనేజీ పనులు ను పరిసిలించారు. పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నల్లవెంగణపల్లి పంచాయతీ కలిమిచేను గ్రామంలో వైఎస్సార్ సీపీ యువ నాయకులు ఎం సుధాకర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి స్థానిక నాయకులు తో కలిసి కలిమి చేను గ్రామానికి వచ్చి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్గ పాద యాత్రలో ప్రజల కష్టాల ను తెలుసుకొని ఎన్నికల మ్యానిఫెస్టోను తయారు చేయడం జరిగిందని, నవరత్నాల కార్యక్రమం ద్వారా అన్నీ వర్గాల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తతంగా 30 లక్షల 75 వేల ఇంటి పట్టాల పంపిణీ చేసి కార్యక్రమాని అమలు చేస్తున్న నిబద్దత కలిగిన నాయకుడు, అనునిత్యం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రజలకు సుపరిపాలన అందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్రాల కంటే మూడో స్థానంలో ఉన్నారని చెప్పారు. సచివాలయ,వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటకే తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా అభివృద్ది చేసేందుకు తగు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఎస్.సి.,ఎస్.టి., బి.సి మైనారిటీలకు చెందిన ఐదు మందికి ఉపముఖ్యమంత్రులుగా చేసి 57 కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి 700 మంది ని కార్పొరేషన్ డైరెక్టర్లుగా చేసిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ది పధంలో పయనింప చేసేందుకు అనేక విప్లవాత్మక కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేపడుతున్నారని, అమ్మ ఒడి, ఆంగ్ల విధ్య, నాడు-నేడు, జగన్నన్న వసతి దీవెన, ఇలా పలు పధకాలను అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో పయనించేందుకు కృషి చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ చళాం పాళ్యం సుకుమార్,నాయకులు పేట ధనంజయులు రెడ్డి, సుబ్బయ్య,హేమ సుంధర్ రెడ్డి, నారాయణ రెడ్డి,డీల్లీ ప్రసాద్ రెడ్డి,ఉమాపతిరెడ్డి,పద్మనాభ రెడ్డి,వెంకటేష్,రామయ్య,శ్యామల,గోవిందన్,రోశిరెడ్డి,బోజ్జారెడ్డి, గణపతి రెడ్డి,సర్పంచ్ లుశిల్పా, గోవిందయ్య,పష్ప,భువనేశ్వరి,వైకాపా కార్యకర్తలు కోలార్ రేష్,విక్కీ,గోపి,క్రిష్ణయ్య,వెంకటచలపతి,డానియేల్,బాలయ్య, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజల గుండెల్లో చిర స్థాయిగా జగన్ ఉంటారు – ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి
Advertisement
తాజా వార్తలు
Advertisement