తిరుమల: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి మరిన్ని రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఇప్పటికే 80శాతం రైళ్లను పున్నరుద్దరించామని.. డిమాండ్ ఉన్న ప్రతీ చోట రైళ్లను నడుపుతున్నామని తెలిపారు. భక్తులను దృష్టిలో పెట్టుకొని తిరుపతి రైల్వేస్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. భారత్ బలమైన దేశంగా మరోసారు రుజువు చేసుకుందన్నారు. ప్రపంచ దేశాలను వసుధైక కుటుంబంగా మోడీ భావించారని తెలిపారు. కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే అన్ని దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. 150దేశాలకు మందులు సరఫరా చేయ్యగా…ఇప్పటికే 75 దేశాలకు వాక్సిన్ పంపిణీ చేశామన్నారు. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని,. వాక్సినేషన్ ప్రక్రియ ముగిసే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రమంత్రి సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement