Tuesday, November 26, 2024

చెరువు కట్టలు కబ్జా – యథేచ్చగా తవ్వకాలు

తొట్టంబేడు – : కట్టాదారులు ప్రభుత్వ భూమి ఏది అయినా సరే ఆక్రమించేస్తున్నారు భూకబాదారులు చెరువు కట్టలను సైతం యథేచ్ఛగా తవ్వేస్తూ కబ్దాలకు పాల్పడుతున్నారు. మండలంలో భూకబాదారులు చెరువులు, బావులు, వాగులు, వంకలు, గుట్టలు అని తేడా లేకుండా యథేచ్ఛగా భూకబ్దాలు చేసుకుంటూ పోతూ రెవెన్యూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తొట్టంబేడు మండలంలోని పూడి గ్రామ రెవిన్యూలో మాలవానిగుంట చెరువుకట్టను సైతం జే.సి.బి సహాయంతో కొందరు భూకబాకోరలు గత కొద్దిరోజులుగా చెరువు కట్టను తొలగించి ఆక్రమణ చేస్తున్నారు. ప్రశ్నించే వారు కరువయ్యారు. మాలవానిగుంట చెరువుకట్ట కట్టా చేయడానికి ముందు బలంగా ఉ ండేది కానీ ఇప్పుడు కొద్దిపాటి వర్షానికి ఈ చెరువుకట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నది. వర్షాకాలంలో పంట పొలాలు ముంపుకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఈ చెరువుకట్ట ఆక్రమనపై తగిన చర్యలు తీసుకోవాలని చెరువుకట్టను కాపాడాలి అని పూడి గ్రామ రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement