శ్రీకాళహస్తి – మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శివయ్య ఉత్సవాలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్కంనే ని శ్రీ కృష్ణ. రాష్ట్రంలో తిరుమల తర్వాత దక్షిణ కాశీగా శ్రీకాళహస్తీశ్వరాలయం రాహుకేతు పూజల నిలయం బోలా శంకరుడు బ్రహ్మోత్సవాలు గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎమ్మెల్యే భక్తులకు అన్ని వసతులు ఉండాలనే ముందుచూపుతో ఆలయ అధికారులు సమన్వయంతో నెలరోజులుగా అన్ని తానై ఆలయానికి వచ్చే భక్తులు మెచ్చే విధంగా ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల ఫలాలు, రుద్రాక్షలు , ప్రత్యేక పుష్పాలతో ఆలయంలో ప్రత్యేక నిపుణుల అలంకరణ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని గతంలో మహాశివరాత్రి రోజున స్థానికులకు దర్శనం నామమాత్రంగా జరిగేదని ఈ ఏడాది స్థానికులు అందరూ ఆధార్ కార్డు తీసుకొని ప్రత్యేక దర్శనం చేసుకోవాలని పిలుపునివ్వడంతో పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించు కోరడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే పిలుపుతో వెయ్యి మంది శివయ్య మాల ధారణ చేసి స్వామివారి సేవలో పాల్గొనడం జరిగిందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement