మదనపల్లి రూరల్ , తహశీల్దార్ లు, గృహనిర్మాణ శాఖాధికారులు సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఎం. జాహ్నవి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం, సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు గృహ నిర్మాణ శాఖ అధికారులు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం,పీలేరు ఈ.ఈ, డి.ఈ లు,మదనపల్లి తహశీల్దార్ లతో ఇంటిపట్టాలకు సంబందించిన ఔ ట్లు నిర్మాణాల లో చేయవలసిన ఏర్పాట్లు అంశాలపై డి.ఈ ల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ తహశీల్దార్ లు, గృహనిర్మాణ శాఖాధికారులు సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అన్ని చర్యలు వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో వై.ఎస్. ఆర్ ఇంటి పట్టాలకు అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, వాటికి సంబందించిన లే అవుట్లు లో లబ్ధిదారులకు నెంబరింగ్ అందజేయాలని తహశీల్దార్ లను ఆదేశించారు. లే అవుట్లు లో లబ్దిదారులకు అందజేసిన నంబరింగ్ ను జియో ట్యాగింగ్ చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. లే అవుట్లు లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని, రోడ్ల పనులను సంబంధించి పనులను వెంటనే చేపట్టాలని, ఇంటి పట్టాలు పొందిన లబ్దిదారులకు లే అవుట్లు లో లబ్ధిదారులకు ఫ్లాట్ నంబర్లను చూపించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఇంకా లే ఔట్లు కు సంబందించి ఏమైనా సమస్యలు ఉంటే తహశీల్దార్ లతో, గృహనిర్మాణ శాఖ అధికారులు చర్చించుకొని అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. ఇంటి పట్టాలు పంపిణీలో అనర్హులకు పట్టాలు పంపిణీ చేస్తే అలాంటి వారి పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లే ఔట్లు లకు సంబందించి కోర్టులో కేసులు ఉంటే అలాంటి వాటిని కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అభివృద్ది చేయడం జరుగుతుందని తెలిపారు. లే ఔట్లు లలో తహశీల్దార్లు లబ్ధిదారులకు నెంబరింగ్ ఇచ్చిన వాటిని జి యో టా గింగ్ చేయడమే జరుగుతుందని డీఈ లు సబ్ కలెక్టర్ కు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డి.ఏ.ఓ జయరాములు,గృహ నిర్మాణ శాఖ ఈ.ఈ నాగేష్, గృహ నిర్మాణ శాఖ డి.ఈలు చంద్రశేఖర్, నరశింహా చారి, రమేశ్ రెడ్డి, గురు రాజన్,నాయక్, మదనపల్లె తహశీల్దార్ కుప్పు స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇంటి పట్టాల పంపిణీలో సమస్యలు ఉంటే పరిష్కరించాలి…సబ్ కలెక్టర్ జాహ్నవి
Advertisement
తాజా వార్తలు
Advertisement