మదనపల్లి రూరల్ – వింద్యా టెలీ లింక్స్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసే కేబుల్స్ కు అటవీ భూములకు సంబందించి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాలని సబ్ కలెక్టర్ ఎం.జాహ్నవి పేర్కొన్నారు. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం, సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు ఎర్రావారి పాళ్యం మండల తహశీల్దార్ ఎస్. మహేశ్వరి భాయ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి.రాంలానాయక్, సహాయ గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎస్.మూర్తి లతో కలిసి సబ్ డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మదనపల్లి రెవిన్యూ డివిజన్, ఎర్రావారిపాల్యం మండలం, ఉస్తికాయలపెంట గ్రామం రెవెన్యూ పరిధిలోగల కొంపార్ట్ మెంట్ నెం.19 మరియు 20 ద్వారా రాయచోటి నుండి బాకరపేటకు వెళ్లే వింద్యా టెలీ లింక్స్ లిమిటెడ్ కేబుల్ వేయుటకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా, ఉంటే వాటిని ఎలా పరిసకరం చేయాలని,రెవిన్యూ, అటవీ శాఖ, గిరిజన సంక్షేమశాఖ అధికారు కలసి పరిష్కరించాలని తహశీల్దార్ ను ఆదేశించారు. ఉస్తికాయలపెంట మరియు మేళ్ల చెరువు బీట్ పరిధిలో అటవీ రేంజ్ నకు సంబందించి 0.05 హెక్టార్లు అటవీ భూమిలో వింద్యా టెలీ లింక్స్ లిమిటెడ్, సికింద్రాబాద్ వారు కేబుల్ వేసుకొనుటకు గాను అటవీహక్కు చట్టం 2006 క్రింద ఫార్మ్-1 ఏ టు హెచ్ సర్టిఫికేట్ ఇచ్చుటకు ఎలాంటి ఇబ్బంది లేదని తహశీల్దార్ సబ్ కలెక్టర్ గారికి వివరించారు.
ఎర్రావారి పాల్యం మండలంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయిస్తున్నారా, గ్రామాలలో పాజిటివ్ వస్తే ఎలాంటి చర్యలు చేపడుతున్నారని తహశీల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. కరోనా వచ్చిన గ్రామాలలో కంటైన్ మెంట్ జోన్ నిర్వహించాలన్నారు. అందరూ మస్కూలు ధరించే విధంగా, సామాజిక ధూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కు సూచినారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ జానికి రామ్, ఫారెస్ట్ స్కానర్ ఆఫీసర్ చినబాబు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఎస్. సబియా సుల్తానా, టి. రెడ్డెప్ప, వి.ఆర్.ఓ రెడ్డెన్న, గిరిజన సంక్షేమ సహాయ అధికారి మోహన్ రావు, వింద్యాటెలీ లింక్స్ ప్రాజాక్ట్ ఇంచార్జ్ ఏ. శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ కార్యాలయపు సీనియర్ సహాయకులు విన్సెంట్ తదితరులు పాల్గొన్నారు.
అటవీ భూములకు సంబందించి సమస్యలు పరిష్కరించాలి.. సబ్ కలెక్టర్ జాహ్నవి
Advertisement
తాజా వార్తలు
Advertisement