Friday, November 22, 2024

అగచాట్ల వసతి…ఎందుకు ఈ దుర్గతి


*అధ్వానంగా  ఎస్సీ , బిసి బాలుర కళాశాల వసతి గృహాలు

*అర్ధాకలితో విద్యార్థుల అవస్థలు
*గదులు లేక బయట ఉంటున్న విద్యార్థులు
*ఇంచార్జి వార్డెన్లతో సమస్యలు

సత్యవేడు, : విద్యార్థులకు వసతి గృహల్లో అగచాట్లు అధికమవుతున్నాయి. తల్లి దండ్రులను వదిలి ఎక్కడినుంచో వచ్చిన విద్యార్థులకు ఈ లాంటి అవస్థలు భరించడం మావళ్ల కాదంటూ అర్ధాంతరంగా చదువు మానుకొని ఇంటిముఖం పట్టె పరిస్థితులు తలెత్తుతున్నాయి. పేదవిద్యార్థులకు అన్ని సమకురుస్తున్నామన్న అధికారుల మాటలు నీటిమూటలుగా మారాయి. అర్ధాకలి చదువులు, పెచ్చులూడుతున్న భవనాలు, భద్రత లేని గదులు, మరుగులేని దొడ్లు, రాత్రిలో కంటినిండా నిద్రలేక అవస్థలు. వెనుకబడిన సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి దయతో ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. అందుకు అనుగుణంగా కళాశాల విద్యార్థులు ఉండేందుకు వస్థీగృహలు మంజూరు చేశారు. వీటికి శాశ్వత భవనాలు లేకపోవడంతో అప్పటికే ప్రాథమిక, హైస్కూల్ విద్యార్థులు ఉంటున్న ఎస్సి వసతిగృహల్లో ఎస్సి విద్యార్థులకు కేటాయించగా గిరిజన విద్యార్థులు లేకుండా మూతపడిన వసథిగృహాన్ని బీసీ కళాశాల విదేర్ధులకు కేటాయించారు. ప్రస్తుతం వాటి పరిస్థితి అధ్వానంగా మారింది. స్థానిక పాలకులు వాటిపై కన్నెతి చూడకపోవడం, జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ కోరవడడంతో విద్యార్థులు అవస్థలు నడుమ కాలం వెళ్ళదిస్తున్నారు. ఎస్సి హాస్టల్లో సుమారు 50 నుంచి 60 మంది విద్యార్థులున్నారు. భవనం పైపెచ్చులుడుతుండడంతో ఏ సమయంలో పైన పడుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా కడుపు నిండేలా అన్నం ఉండడంలేదని, రాత్రిలో గదుల్లో ఫ్యాన్లు లేక చీకటీగల ధాటికి నిద్రరాక చిన్న గదుల్లో 10 నుంచి 15మంది విద్యార్థులు నిద్రించాల్సి వస్తుందని ఎస్సి వసతి గృహంలో విద్యార్థులు పేర్కొన్నారు. 100మంది విద్యార్థులు ఉండే బిసి హాస్టల్ పరిస్థితి మరోలా ఉంది. ఒక గదిలో 20మంది పడుకోవాల్సి రావడం, కనీసం మరుగుదొడ్లకు తలుపులులేకపోవడం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని అక్కడి విద్యార్థులు వాపోతున్నారు. కొందరు విద్యార్థులు బయట గదులు తీసుకొని భోజనం మాత్రం ఇక్కడ చేసి వెళ్తున్నారు. రెండు హాస్టళ్లలోను మెనూను విద్యార్థులకు చూపకపోవడంతో వాలు పెట్టింది తిని కాలం గడపాల్సిన పరిస్థితి. ప్రశ్నించిన విధ్యార్ధులపై తిట్ల పురాణం అందుకోవడం అక్కడి సిబ్బంది తీరుగా మారింది. రెండు హాస్టళ్లకు నాగలాపురం, ఇరుగుళం హాస్టల్ వార్డెన్లు ఇంఛార్జీలుగా ఉండడంతో విధ్యార్థులు మరింత అవస్థలకు గురికావల్సి వస్తుంది. ఇప్పటికైనా స్థానిక పాలకులు, జిల్లా అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement