నాగలాపురం 13మండలం సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వరస్వామి ఆలయంలో గత 11 రోజులుగా కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిసింది . చివరి రోజు శ్రీ మారగదఅంబికావాల్మీకిశ్వర స్వామి అమ్మ వాళ్లు రావణబ్రహ్మ వాహనంపై సురుటుపల్లి తిరువీధుల్లో ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది .బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు శనివారం తెల్లవారుజామున 5 గంటలకు యాగశాల పూజ ,ఉదయం ఏడు గంటలకు శ్రీ శివగామి సమేత నటరాజ స్వామి వారికి అభిషేకం , ఉదయం ఎనిమిది గంటలకు సూర్ణోత్సవంలో భాగంగా పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం జరిగింది .తదనంతరం పదిన్నర గంటల సమయంలో ఆలయ చైర్మన్ ఏవిఎం మునిశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో త్రిశూల స్థానం నిర్వహించారు .ఉత్సవ పర్యవేక్షకుడు అయినా త్రిశూలం మూర్తులకు అష్ట ద్రవ్యాలతో ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించిన తర్వాత పుష్కరిణిలో స్థానం చేయించడం జరిగింది .దీనికి తమిళనాడు తిరువల్లూరు పట్టణానికి చెందిన కుబేరన్ ఉదయదారులుగా వ్యవహరించారు . ఉదయం 11గంటలసమయంలో ఉత్సవమూర్తులకు ఆభిషేకం ,పూర్ణాహుతి , కలశాభిషేకం ,దీపారాధన ,6 గంటలకు శాంతిహోమం నిర్వహించారు .7గంటల సమయంలో ధ్వజారోహణ చిత్రపటం అవరోహణ ,తదుపరి ఆచార్యఉత్సవం జరిగింది .రాత్రి ఏడున్నర గంటల సమయంలో రావణబ్రహ్మ వాహనంపై స్వామి అమ్మవార్లు ఊరేగింపు ఆలయ ప్రధాన మండపం నుంచి ప్రారంభమై తిరువీధుల్లో కొనసాగే భక్తులకు దర్శనమిచ్చారు .చివరిరోజు ఆలయంలో స్వామి అమ్మవార్లకు జరిగిన కార్యక్రమాలకు ఉభయదారుడిగా శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రసన్నారెడ్డి వ్యవహరించారు .ఆలయ ప్రధాన అర్చకుడు కార్తికేసన్ ,పుత్తూరు ప్రత్యేక అర్చకుడు మూర్తి ఆధ్వర్యంలో 15 మంది ఋత్విక్కులు బృందం గత 11 రోజులుగా సురుటుపల్లి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగింది . ఇందులో భాగంగా చివరి రోజు శ్రీసిటీ ప్రతినిధి భానుప్రసాద్ రెడ్డి తమ సిబ్బందితో కలిస ఉత్సవమూర్తుల స్వామి వారి సేవలో పాల్గొన్నారు .ఆలయ చైర్మన్ ఏవిఎం మునిశేఖర్ రెడ్డి ముందుచూపుతో వ్యవహరించి అనేకమంది దాతలను కలిసి విరాళాలు సేకరించడం ,దేవాదాయ ఉన్నతాధికారుల సహకారంతో శ్రీకాళహస్తి వంటి శివాలయాల బ్రహ్మోత్సవాలకు దీటుగా పుష్ప అలంకరణ ,మిరుమిట్లుగొలిపేవిద్యుత్ దీపాలఅలంకరణ ,భక్తులకు తాగునీటి వసతి ,అన్నదాన కార్యక్రమాలు ,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంలో ఆలయధర్మకర్తల మండలి సభ్యులు పద్మ పద్మనాభరెడ్డి ,జయప్రకాష్ , గీతమురళి ,రమణిసురేష్ ,వెంకటేష్ , రవీంద్రారెడ్డి ,పార్థసారథి ,గీతనారాయణ , ఆలయ ప్రత్యేక ఆహ్వానితులు రాధాకృష్ణారెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
Advertisement
తాజా వార్తలు
Advertisement