అటువంటి ఆలోచన లేదన్న మెగాస్టార్
పవన్ కూడా తాను రావాలని అనుకోడంటూ కామెంట్
కుటుంబ సభ్యుడిగా మద్దతుగా వీడియో రిలీజ్ చేశా
కూటమి గెలిస్తే ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు
తమ వంతు ప్రయత్నం చేయాలి
హైదరాబాద్ – తాను రాజకీయాలకు అతీతుడునని పద్మవిభూషణ్ గ్రహీత మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గత రాత్రి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ స్వీకరించిన ఆయన ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ… తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని చెప్పారు. తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
పిఠాపురానికి తాను రావాలని కల్యాణ్ కోరుకోడన్నారు. తన సోదరుడు ఎప్పుడూ బాగుండాలని… జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటానన్నారు. తన తమ్ముడు రాజకీయంగా ఎదగాలని మా కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందన్నారు. కుటుంబ సభ్యుడిగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా వీడియో విడుదల చేశానని, అతను గెలిచి ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులని, ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే ఎన్టీఆర్‌కు భారతరత్నపై ఆలోచన చేయాలని కోరారు.