Tuesday, November 26, 2024

China Gollapalem – క‌బ‌ళిస్తున్న క‌డ‌లి – క‌నుమ‌రుగు కానున్న దీవి…

కృష్ణా, ప్రభ న్యూస్‌ బ్యూరో :

చక్కని పల్లెను తన కెరటాలతో పలుకరించే సాగరం… ఉధృతంగా నురుగులు కక్కుతూ ప్రవహించే కొత్తకాల్వ… నిండు గర్భిణిలా కట్టలను తన్ను తూ ప్రవహించే ఉప్పుటేరు… ఈమూడింటి నడుమ ఆ పల్లె పండ్లతోటలతో, పాడి పంటలతో ఆలరారుతోంది. చుట్టూ జలాలు వున్నా చక్కని మానవ కల్పిత ద్వీపంగా కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం దీవి ప్రకృతి రమ ణీయతకు మరురూపుగా నిలుస్తోంది. ప్రకృతి సోయగాల మధ్య అలలాడుతు న్న చినగొల్ల పాలెం సమస్యల వలయం లో కొట్టు-మిట్టాడుతోంది.15వేల జనాభా వున్న చినగొల్లపాలెంలో స్థానికులే తమ కు కావల్సిన వసతులను కల్పించుకుని జీవిస్తున్నారు. ప్రధానంగా పండ్లతోటలు, కొబ్బరి తోటలను పెంచడం ద్వారానే వీరు ఆదాయన్ని పొందుతున్నారు. రెండు ప్రధాన మైన కాలువల మధ్య వున్న ఈ ద్వీపం క్రమం గా సముద్రపు కోతకు గురువుతోంది. రెండు వైపులా వున్న కాలువలు కూడా తమ శక్తి మేరకు చినగొల్లపాలెంను కబళిస్తున్నాయి.

చినగొల్ల పాలెం ద్వీపం 18 కిలోమీటర్ల విస్తీర్ణం, ఏడు కిలోమీటర్ల పొడవుతో వుంది ప్రస్తుతం డ్రైన్ల కోతతో ఈ ద్వీపం విస్తీర్ణం క్రమంగా తగ్గుతోం ది. చిన్నగొల్లపాలెం 1977 సంవత్సరం ముందువరకు సాధారణ గ్రామమే. 1977లో ఇక్కడ కొత్త కాల్వ (స్ట్రెయిట్‌ కట్‌) ను తవ్వారు. దీంతో ఈ గ్రామం ఒక దీవిగా మారిపోయింది. పశ్చి మగోదావరి, కృష్ణా జిల్లాల నడుమ ప్రవ హిస్తున్న పాత ఉప్పుటేరు ద్వారా కొల్లేరులోని వరద నీరు ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మీదుగా ప్రవహించే యనమదుర్రు డ్రెయిన్‌ నుంచి వచ్చే వర్షపు, మురుగు నీరు చినగొల్ల పాలెం-పాతపాడు వద్ద ఉప్పుటేరులో కలిసి శివారు లోని మోళ్లపర్రు వద్ద సముద్రంలో కలుస్తుంది.

ఇలా రెండు వైపులా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో చినగొల్లపాలేనికి ముంపు ప్రభావం ఎక్కువైంది. ఉప్పుటేరుకు కొల్లేరు నుంచి నీరుతోపాటు- వర్షాకాలంలో వచ్చే వరద తాకిడి కారణంగా పశ్చిమగోదా వరి, కృష్ణాజిల్లాలో పెద్దఎత్తున పంట పొలాలు ముంపునకు గురయ్యేవి. దీనిని దృష్టిలో వుంచు కుని ఉప్పుటేరు నీటి వరవడిని తగ్గించేందుకు చినగొల్లపాలెంకు కృష్ణాజిల్లాతో వున్న భూ మార్గాన్ని తవ్వి కొత్త కాల్వను ఏర్పాటు- చేశారు. గ్రామానికి పడమర వైపున 1977లో కొత్త కాల్వను తవ్వారు. అప్పట్లో 20 కోట్ల రూపా యల వ్యయంతో ఉప్పుటేరు 29వ మైలు నుంచి 39వ మైలు వరకు కొత్తకాల్వ తవ్వా రు. దీనిని అనుగుణంగా ఎనమదుర్రు డ్రైన్‌ ముందు భాగంలో కొత్తకాల్వను కొల్లేరు డ్రైన్తో అనుసంధానించారు. 20 మీటర్ల వెడల్పుతో తవ్విన కొత్త కాల్వ నేడు ఓ నదిలా మారిపోయిం ది. ఇరువైపులా గట్లను కోతకు గురి చేస్తూ 400 మీటర్ల వెడల్చైంది. నాలుగు కిలోమీటర్ల పొడవై న ఈ కాల్వ సముద్రంలో కలిసే ప్రదేశంలో దీవిని అత్యధికంగా కోతకు గురిచేస్తోంది. చినగొల్లపాలెం గ్రామానికి శివారు ప్రాంతం.. ఏటిమొండి పల్లెపాలెం.. ఇక్కడ అధికంగా దీవి దక్షిణం వైపు కోతకు గురవు తోంది. మోళ్లపర్రు వద్ద సముద్రంలో కలిసే ఈ పాత ఉప్పుటేరు కోర్సు దిశ మార్చుకొని పడమర వైపు ఏడాదికి 100 మీటర్ల చొప్పున ప్రయాణిస్తోంది. దీనివల్ల ఎంతో విలువైన కొబ్బరి, సర్వి తోటలు సుమారు నాలుగు నుంచి 5 వేల ఎకరాల వరకూ కడలిలో కలిసిపోయాయి.
ఇవన్నీ పట్టాభూములే కావడం గమనార్హం. సముద్రపు కోత ఇలానే కొనసాగితే ద్వీపాన్ని సముద్రం మింగేయడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోం ది. కొత్తకాల్వ నీటి వరవడిని తగ్గించేందుకు ఉప్పుటేరుకు కొత్తకాల్వకు మధ్యలో నీరు వెను కకు మళ్ళకుండా పశ్చిమగోదావరి జిల్లాకు చినగొల్లపాలెం మధ్య అడ్డుకట్ట వేయాలని 1993లో ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదిం చారు. దీనివల్ల ఉప్పుటేరు రెండుగా విభజించ డం జరుగుతుంది.

అయితే ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.కొత్త కాల్వపై రెగ్యులేటర్‌ నిర్మించడం వల్ల దీవి కోత పరిష్కా రమవుతుంది. కొత్తకాల్వపై పడతడిక వైపు నిర్మించిన వంతెనకు ఎగువన రెగ్యు లేటర్‌ నిర్మాణం చేపట్టాలి. దీనివల్ల పాత ఉపుటేరు కోర్సు పునరుజ్జీవం చెంది.. నీటి ప్రవాహం పెరుగుతుంది. పాత ఉప్పుటేరులో తవ్వోడంతో పూడిక తీస్తే ఈ నీటి ప్రవాహం మరింత పెరుగు తుంది. అప్పుడే నదీ ముఖద్వారాన్ని ఏర్పరిస్తే ఫలితం ఉంటు-ంది. రెగ్యులేటరు నిర్మించకుం డా పాత ఉప్పుటేరులోని పూడిక తీయడం, నదీ ముఖద్వారం ఏర్పర్చడం శాస్త్రీయంగా తప్పు అవుతుందని నిపుణులు పేర్కొంటు-న్నారు. ఇటీ-వల చిన్నగొల్లపాలెం ద్వీపానికి, తూర్పు వైపున్‌ పాత కాలువ (ఓల్డ్‌ కోర్సు)పై మోళ్లపర్లు- ఏటిపడు మధ్య రూ. 186.8 కోట్లు-, పశ్చిమ వైపున కొత్త కాలువ (న్యూకోర్సు)పై రూ.118.5 కోట్లు-, నిడమర్రు -కృత్తి వెన్ను మధ్య పెదలంక డ్రైనుపై రెగ్యులేటర్‌ కంబ్రిడ్జి నిర్మించి నీటి ప్రవా హం నియంత్రణకు లాకు లను ఏర్పాటు- చేయా లని ప్రతిపాదించారు. మొత్తం ఈ నిర్మాణాల కోసం రూ.325.3 కోట్లు- అంచనాల రూపొం దించారు. ఈ నిధులు విడుదలకు ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అంగీకరించా రు. వీటికి సంబంధించి అంచనాల రూపొందిం చి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement