ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని పచ్చిమిర్చి రైతులు త్రిప్స్ మహమ్మారి కారణంగా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లోనూ దాదాపు 5 లక్షల హెక్టార్లలో మిరప పంటపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కారణంగా దాదాపు 3వేల రూపాయల నష్టం రైతులకు వాటిల్లిందని అంచనా. ఇది వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటుగా వారిని పూర్తి నిరాశకూ గురి చేస్తుంది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారి పేట గ్రామానికి చెందిన రైతు రాగం మల్లేశం తన అనుభవాలను పంచుకుంటూ… తామిప్పుడు తీవ్ర కష్టాల పాలు కావడంతో పాటుగా జీవనోపాధినీ కోల్పోయామన్నారు. తమ పంటలను త్రిప్స్ పూర్తిగా నాశనం చేసిందన్నారు. మార్కెట్లో తమకు ప్రత్యామ్నాయం కూడా లభించడం లేదని అన్నారు. అలాగే ఖమ్మం జిల్లా ఎక్నూరు మండలం టీఎల్ పేట గ్రామానికి చెందిన రైతు పల్లెబోయిన ముత్తయ్య మాట్లాడుతూ … ప్రభుత్వం తప్పనిసరిగా ఫోసలోన్, డీడీవీపీని తిరిగి తీసుకురావాలన్నారు. ఈ రెండింటి తో తమకు మంచి అనుభవాలే ఉన్నాయన్నారు. ఇప్పుడు ఎదుర్కొంటున్నట్లుగా నష్టాలను గతంలో ఎన్నడూ తాము ఎదుర్కోలేదన్నారు. అధికారులు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఈ ఉత్పత్తులను నిషేదించారన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోని ఉత్పత్తులు అంతగా ప్రభావం చూపడం లేదని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital