Saturday, November 23, 2024

Chittoor | చిన్నారి హత్య… బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీఎం

పుంగనూరులో ఆరేళ్ల బాలిక అదృశ్యమైన ఘటన విషాదంగా మారింది. అజ్మతుల్లా కుమార్తె అస్వియా…. స్నేహితులతో కలిసి ఇంటి వద్ద‌ ఆడుకుంటూ అదృశ్యం కాగా ఆ కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేర‌కు కేసు వివరాలను జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాకు వెల్లడించారు. కనిపించకుండా పోయిన చిన్నారి రెండు రోజుల తర్వాత వాటర్ ట్యాంక్‌లో శవమై కనిపించింది. ఆర్థికపరమైన కారణాలతోనే బాలికను హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ లో నిందితులు పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని సీఎం చంద్రబాయి, మంత్రులు వంగలపూడి అనిత, పరూక్, రాంప్రసాదొడ్డి పరామర్శించారు. సీఎం చంద్రబాయి చిన్నారి తండ్రితో ఫోన్ మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు.

అనంతరం హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ హత్య కేసులో ఐదుగురు అనుమానితులను గుర్తించామన్నారు. వారిని అరెస్టు చేసి, చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు. చిన్నారిని అత్యాచారం. చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. శవపరీక్ష నివేదికలోనూ ఆ ప్రచారం అవాస్తవమని తేలినా, వైకాపా నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అసలేం జరిగింది..

అజ్మతుల్లా అనే వ్యక్తి కూతురు అస్వియా…. స్నేహితులతో ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యం అయ్యింది. అస్వియా తండ్రి అజ్మతుల్లా వద్ద అప్పు తీసుకున్న మహిళ‌ ఆర్థికపరమైన కారణాలతో అస్వియాను కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకెళ్లి హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ లో పడవేసిందని పోలీసులు వివరించారు. అప్పు తీర్చాలని అజ్మాతుల్లా ఒత్తిడి తీసుకురావడంతో ఆయనను ఏమీ చేయలేక ఆయన కుమార్తెపై నిందితురాలు దారుణానికి ఒడిగట్టిందని వివ‌రించారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement