Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP | శిశువు మృతిపై బాలల హక్కుల సంఘం సీరియస్.. సుమోటోగా దర్యాప్తు

AP | శిశువు మృతిపై బాలల హక్కుల సంఘం సీరియస్.. సుమోటోగా దర్యాప్తు

0
AP | శిశువు మృతిపై బాలల హక్కుల సంఘం సీరియస్.. సుమోటోగా దర్యాప్తు

( ఆంధ్రప్రభ, ఏలూరు బ్యూరో) : ఏలూరు అశోక్ నగర్ లో చోటు చేసుకున్న మరో రాములమ్మ కథపపై ఏపీ బాలల హక్కుల కమిషన్ సీరియస్ అయింది. మూడు రోజుల్లో ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి దర్యాప్తు జరపాలని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ కేసలి అప్పారావు, సభ్యులు డాక్టర్ జంగం రాజేంద్ర ప్రసాద్ ఆదేశించారు.

ప్రభుత్వం అందించిన నివేదిక ఆధారంగా భాద్యులపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ఏలూరులో ఏపీ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ..

వసతి గృహం సిబ్బంది, తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాలల చట్టాలు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరూ విధిగా తెలుసుకోవాలన్నారు.

తల్లి గర్భం ధరించినప్పటి నుంచి 18 ఏళ్లలోపు బాల బాలికల కోసం అనేక చట్టాలు, సంస్కరణలు, రాష్ట్రాలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఏలూరు ఇలాంటి దురదృష్టకర ఘటన జరగటం చాలా బాధాకరమన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా స్థాయిలో బాలల సంరక్షణను ప్రతి శాఖ అధికారులు పర్యవేక్షణ అవసరం అన్నారు.

Exit mobile version