Tuesday, November 26, 2024

పుస్తకాలు చ‌దివేలా పిల్ల‌ల్ని ప్రోత్స‌హించాలి.. అది త‌ల్లిదండ్రులు బాధ్య‌త‌గా తీసుకోవాలి: ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌..

విజయవాడ, ప్ర‌భ‌న్యూస్ : మ‌హ‌మ్మారి క‌రొనాతో చ‌దువుల విధానం మారుతోంది. ఈ టైమ్‌లో పిల్ల‌లు ఆన్ లైన్ క్లాసులు అని పూర్తిగా సెల్ పోన్ల‌కు అంకితం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్తుతుల్లో పిల్ల‌లు టెక్నిక‌ల్ గాడ్జెస్స్ కి అడిక్ట్ అయ్యె ప్ర‌మాదం ఉంది.. పిల్ల‌ల‌తో పుస్త‌క ప‌ట‌నం చేయించే పూర్తి భాద్య‌త త‌ల్లిదండ్రులపైనే ఉంది అని గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ అన్నారు. విజయవాడలో 32వ పుస్తక మహోత్సవాన్ని గవర్నర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇతర భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా తెలుగు పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలని ఆకాంక్షించారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందని తెలిపారు.

‘పుస్తకం హస్త భూషణం’ అన్న ప్రసిద్ధ తెలుగు సామెతను ఉటంకించటం ఇక్కడ సముచితమన్న గవర్నర్.. తాను స్వయంగా పుస్తక ప్రియుడినని, ఒడియా భాషలో దేశభక్తి సాహిత్యాన్ని, విభిన్న రచనలను అందించానని గుర్తుచేసుకున్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సొసైటీ గత 18 సంవత్సరాలుగా మంచి గ్రంథాలయాన్ని నిర్వహించటమే కాక, మంచి పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రజలకు అందించటానికి కృషి చేయటం అభినందనీయమన్నారు. గ్రంథాలయాలు మన విజ్ఞాన నిధి వంటివని, మన స్వాతంత్య్ర ఉద్యమానికి దృఢమైన మూలాలను అందించి, ఉద్యమం దేశవ్యాప్తం కావటానికి తోడ్పడ్డాయన్నారు. ‘చదివే పిల్లవాడు ఆలోచించే పెద్దవాడు అవుతాడు.’ అన్న సామెతను గుర్తెరిగి తల్లిదండ్రులు పుస్తక పఠనంపై పిల్లలకు ఆసక్తిని పెంచాలన్నారు. పుస్తక మహోత్సవ కార్యక్రమంలో.. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement