అమరావతి, ఆంధ్రప్రభ:మహారాష్ట్రలో పిల్లల కిడ్నాప్ ఉదంతం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడ అదృశ్యమైన చిన్నారులు మన రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. గడిచిన ఏడాదిలో మహారాష్ట్ర పర్భానీ జిల్లాలో సుమారు పది మందికి పైగా పిల్లలు అదృశ్యమయ్యారు. ఈఘటనలపై అక్కడ మిసి ్సంగ్ కేసులు నమోదు చేసిన మరాఠీ పోలీ సుల దర్యాప్తులో ఆందోళన గొలిపే విషయాలు వెలుగు చూశాయి. పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముకుని లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న ముఠా మూలాలు బయటపడ్డాయి. అయిత మరాఠ పిల్లలను కిడ్నా ప్ చేసిన ముఠా చేతులు మారి మన రాష్ట్రంలో విక్రయాలు కొనసా గు తుండటం మరో ఆందోళన కలిగించే విషయం. దీని వెనుక మరాఠా ముఠాతోపాటు ఏపీకి చెందిన నెట్ వర్క్ ఉం డటాన్ని అక్కడి పోలీసుల విచారణలో గుర్తించారు. దీని వెనుక విజయవాడకు చెందిన ఓ మహిళ కీలకంగా వ్యవహరిం చడాన్నిగుర్తించారు. మగ పిల్లలే లక్ష్యంగా అక్కడ కిడ్నాప్‌లకు పాల్పడిన ముఠా చిన్నారులను రాష్ట్రానికి తీసుకువచ్చి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో లక్షలకు విక్రయించేశారు. ఈ ముఠా మూలాలు కూడా ఇక్కడే ఉండటంతో విజయవాడ కమిష నరేట్ పోలీసులు దృష్టి సారించారు.
ముఠా నెట్‌వర్క్ ఇలా..
పిల్లలు లేని వారికి హైదరాబాద్‌లోని కొన్ని ఐవీఎఫ్ కేంద్రాల్లో పని చేస్తున్న కొందరు ‘ఎగ్ డోనర్స్’ను సమకూర్చే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన శ్రావణి అనే మహిళ ఈ ఏజెంట్లలో ఒకరిగా వ్యవహరిస్తోంది. మహా రాష్ట్ర పర్భానీ జిల్లాలో చిన్నప్పుడే స్ధిరపడిన ఇదే రంగానికి చెందిన సంగీత అనే మహిళ విజయవాడకు చెందిన శ్రావణికి స్నేహితురాలు. మహారాష్ట్రంలో చిన్నారులను కిడ్నాప్‌లకు పాల్పడే ముఠాతో సంబం ధాలున్న సంగీత ద్వారా శ్రావణి ఈ కార్యకలాపాలకు పాల్పడు తున్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. ఎగ్ డోనర్స్ ఏజెంటుగా వ్యవహరించడం కన్నా.. పిల్లలు లేని వారికి నేరుగా చిన్నారులను విక్రయించడమే సులువుగా భావించిన సంగీత, శ్రావణి ఇద్దరు కలిసి జగ్గయ్యపేట పరిసర ప్రాంతానికి చెందిన శిల్ప అనే నర్సు ద్వారా గత ఏఢా దికి పైగా ఈ వ్యవహారం నడుపుతు న్నారు. మహా రాష్ట్రలో దాదాపు పది మంది వరకు పిల్లలు అదృశ్యం పట్ల సీరియస్‌గా తీసుకున్న అక్కడి పోలీసులు ఓ ముఠాను అరెస్టు చేసి విచారణ చేపట్టగా సంగీత, శ్రావణి పేర్లు వెల్లడయ్యాయి. దీంతో పది రోజుల క్రితం రాష్ట్రానికి చేరుకున్న మరాఠ పోలీసులు విజయ వాడ పోలీసు కమిషనరేట్‌లో జగ్గయ్యపేటకు చేరుకున్నారు.
స్ధానిక పోలీసుల సహకారంతో శ్రావణిని అదుపులోకి తీసుకుని ఏడాది క్రితం ముంబయిలో కిడ్నాప్ అయిన బాలుడుని జగ్గయ్యపేట దేచు పాలెం గ్రామంలో గుర్తించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఐదుగురు మగ పిల్లలను ఈ ముఠా విక్రయించగా నలు గురు జగ్గయ్యపేట, ఒకరిని విస్సన్నపేటలో అమ్మి సొమ్ము చేసుకు న్నట్లు వెల్లడైంది. ఒక్కొక్కరిని మూడు లక్షలకు పైగా విక్రయించినట్లు పోలీసులు చెబుతున్నారు. మహారాష్ట్ర పోలీసులు ప్రస్తుతం జగ్గయ్య పేట పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు. వత్సవాయి మండల దేచుపాలెంలో ఇద్దరు పిల్లలు లభ్యమయ్యారు. జగ్గయ్య పేట బ్రాహ్మణ బజారులో ఒక బాబును పోలీసులు గుర్తించారు. విస్స న్నపేటలో, జగ్గయ్యపేటలో ఉన్న ఇద్దరు చిన్నారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వెలుగు చూసింది ఇలా..
శ్రావణి తీసుకువచ్చిన బిడ్డను శిల్ప కొనుగోలు చేసి జగ్గయ్యపేట లోని మరో మహిళకు రూ.2 లక్షలకు అమ్మగా ఆమె దేచుపాలెంలోని తమ బంధువులకు రూ.3 లక్షలకు బాలుడిని విక్రయించింది. ఆ కుటు-ంబంలో పెరుగుతున్న బాలుడిని జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు- పాఠశాలలో చేర్చి చదివిస్తున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో నాలుగు రోజుల క్రితం పాఠశాల వార్షికోత్సవం జరుగుతుండగా జగ్గయ్యపేట పోలీసులతో కలిసి వచ్చిన మహారాష్ట్ర పోలీసులు సంబంధిత ఆధారాలు, కేసు పత్రాలు చూపి ఆ బాలుడిని తీసుకెళ్లిపో యారు. ఏడాదిగా పెంచుకుంటు-న్న బాలుడిని హఠాత్తుగా పోలీసులు తీసుకువెళ్తుంటే ఆ కుటు-ంబం ఆవేదనకు గురైంది. కాగా బాలుడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు శ్రావణిని తమదైన శైలిలో విచారించగా మొత్తం ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఆమె ఇప్పటి వరకు విక్రయించిన పిల్లల కోసం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిసరాల్లో గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్ధానిక పోలీసుల సహకారం అందిస్తున్నామని, అదేవిధంగా ఈ వ్యవహారంపై కమిషనరేట్ నుంచి పూర్తి స్ధాయిలో దృష్టి సారించి నట్లు విజయవాడ పోలీసు కమిషనరేట్ డీసీపీ ప్రశాంతి ఆంధ్రప్రభ కు వివరించారు.