Tuesday, November 26, 2024

బద్వేల్ ఉపఎన్నిక.. కంట్రోల్ రూమ్ నుంచి సీఈఓ నిఘా

బద్వేల్ ఉపఎన్నిక ప్రక్రియను అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె. విజయానంద్ పరిశీలిస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నదని అన్నారు. ఉదయం 9 గంటల వరకు 10.49 ఓట్లు నమోదు అయినట్లుగా వెల్లడి చేశారు. అన్ని పోలింగ్ స్టేషన్లో ఉదయం 7 గంటలకే మాక్ పోల్ నిర్వహించినట్లు తెలిపారు. మూడు చోట్ల ఈవీఎంలు పని చేయక పోవడాన్ని గుర్తించి వెంటనే వాటిని మార్చి వేశామని చెప్పారు.

స్థానికంగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే రాజకీయ నాయకులు వాటిని అధికారుల దృష్టికి తెచ్చిన వెంటనే  పరిష్కరిస్తామని తెలిపారు. ఈ ఓటింగ్ ప్రక్రియను 24 మంది అధికారులు పరిశీలిస్తున్నారని, ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని వెల్లడించారు. బద్వేల్ నియోజవర్గం సరిహద్దులు అన్ని పూర్తిగా మూసివేశామని వివరించారు. బస్సులలో తరలింపుకు ఎటువంటి ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: బద్వేల్ ఉపఎన్నిక: అట్లూరులో దొంగ ఓట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement