Tuesday, November 26, 2024

వేసవిలో క్లాసులు…నారాయణ, చైతన్యలపై చర్యలకు విద్యార్థి సంఘాల డిమాండ్

కర్నూలు – ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెలవు దినాల్లో కూడా ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్న నారాయణ , శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి మంగళవారం కర్నూల్ నగరంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నారాయణ, చైతన్య కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. బెటర్మెంట్స్ పేరుతో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అయిపోయిన విద్యార్థులకు రెండవ సంవత్సరం సిలబస్ చెప్తున్న నారాయణ , శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలనీ విద్యార్థి సంఘం నేతలు కోరారు.

ఈ సందర్భంగా నగరంలోనీ పలు నారాయణ , శ్రీ చైతన్య విద్యాసంస్థలను సందర్శించారు. ఈ విద్యాసంస్థల్లో వేసవి సెలవు దినాల్లో కూడా అక్రమంగా విద్యార్థులకు తరగతులు నిర్వహించడాని గుర్తించారు. సెకండ్ ఇయర్ సిలబస్ బోధించడం జరుగుతుందన్నారు. వాటితో పాటు బెటర్మెంట్స్ పేరు చెప్పి విద్యార్థి సంఘం నాయకులను మోసగించే ప్రయత్నం చేస్తున్నట్లు వారు గుర్తించారు. ఎస్ఎఫ్ఐ బృందం తరగతులకు వెళ్లి చూస్తే రెండో సంవత్సరం సంబంధించిన సిలబస్ బోధించడం జరుగుతుంది. ఇదేంటని ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ నాయకుల పైన విద్యాసంస్థల యాజమాన్యం దురుసుగా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇదంతా ఆర్ఐఓ పక్కనే ఉన్న యాజమాన్యం విద్యార్థి సంఘం నాయకుల పైన దురసుగా ప్రవర్తించడం గమనార్హం.. ఆర్ ఐ ఓ తరగతులను పరిశీలించి విద్యార్థులను ఇంటికి పంపించమంటే వారి మాటలు కూడా లెక్కచేయకుండా వారిని కూడా అగౌరపరుస్తూ మాట్లాడారు. అంటే ఆర్ఐఓ కూడా భయపడని నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం ఇంకా ఎవరికి భయపడతారనీ ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు ప్రశ్నించారు.

ఇంత దుర్మార్గమైన వ్యవస్థ నడుపుతూ విద్యార్థులను ర్యాంకుల పేరుతో భయాప్రాంతులకు గురిచేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు వెళ్తే మీరు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని తెలివిగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత విద్యా మండలి స్పందించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ అక్రమంగా కళాశాల నడుపుతున్న శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని విద్యార్థి సంఘ నేతలు హెచ్చరించారు. చైనా కళాశాలలను సందర్శించిన ఎస్ఎఫ్ఐ కర్నూల్ సిటీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అమర్ , సాయి ఉదయ్ సిటీ ఉపాధ్యక్షులు నరసింహ సిటీ నాయకులు మల్లేష్ , చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement