Monday, November 18, 2024

తుడా చైర్మెన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మెన్ గా చంద్రగిరి 2024 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించిన రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కానున్నారు.


ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇప్పటికే 2024 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారయ్యారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం గడప గడపకు పర్యటిస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీ టిడిపి నేతలు విమర్శలకు దిగారు. ఏ అధికారిక హోదాలో మోహిత్ రెడ్డి పర్యటిస్తున్నారని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎలా వెంట తిరుగుతున్నారని జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాదులు చేశారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు.

2024 ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలతో మమేకమవడం, ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందన్న క్రమంలో సీఎం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తుడా ఛైర్మెన్ బాధ్యతలు అప్పగించారు. ఇకపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో అధికారిక తుడా ఛైర్మెన్ హోదాలో పర్యటించనున్నారు.
మరోవైపు ఇప్పటికే అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో నిమగ్నమైన భాస్కర్ రెడ్డి తుడా బాధ్యతల నుంచి తప్పుకుని ఇక పూర్తి స్థాయిలో రాష్ట్ర పార్టీ కార్యకలాపాలలో బిజీ కానున్నారని స్పష్టం అవుతోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement