Friday, November 22, 2024

AP: బంగారు చెన్నేపల్లి గ్రామ సమీపంలో చిరుత సంచారం

శ్రీ సత్య సాయి బ్యూరో, నవంబర్ 16 (ప్రభ న్యూస్) శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల పరిధిలోని బంగారు చెన్నేపల్లి గ్రామ సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలో ఉన్న రెండు కుక్కలను చిరుత పులి ఎత్తుకు వెళ్ళింది. బంగారు చెన్నేపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెన్నారెడ్డి తోటలో ఉన్న రెండు కుక్కలను చిరుత పులి దాడి చేసి ఎత్తుకు వెళ్ళినట్లు బంగారు చెన్నేపల్లి గ్రామానికి చెందిన రైతు చెన్నారెడ్డి తెలిపారు.

తన పొలానికి చుట్టూ ఇనుప కంచవేసానని రాత్రి పూటతన పెంపుడు కుక్క తోటలో ఉండగా పులి దాడి చేసి ఎత్తుకు వెళ్ళినట్లు ఆయన తెలిపారు. పులితో కుక్క పోరాడిన గుర్తులు సైతం స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. పొలం చుట్టూ ఎత్తుగా కంచ వేసిన చిరుత పులి ఎగిరి వచ్చి తన పెంపుడు కుక్కని ఎత్తుకెళ్లిందని రైతు చెన్నారెడ్డి ఆవేదన వ్యక్తపరిచారు. చిరుత పులి కుక్కలను ఈడ్చుకు వెళ్లిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిరుత పులి అడుగులు వేసిన గుర్తులు సైతం కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చిరుత పులి గ్రామ సమీపంలోకి వచ్చిన విషయాన్ని రైతు చెన్నారెడ్డి పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. గతంలో సైతం బంగారు చేన్నేపల్లి గ్రామ సమీపంలో గల దంట్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి గాడిదను సైతం ఎత్తుకు వెళ్ళింది. చిరుత పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో రైతులు తమ పొలాల దగ్గరకు వెళ్ళడానికి భయపడుతున్నారు. గొర్రెలు, మేకలు, పొట్టేలు పెంపకదారులు సైతం సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లడానికి ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత పులిని బంధించి, ఇతర ప్రాంతాలకు తరలించాలని బంగారు చెన్నేపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement