తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఘాట్ రోడ్డు 56వ మలుపు వద్ద వాహనదారులకు చిరుతపులి కనిపించింది. దీంతో వాహనదారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా…. భక్తులను అప్రమత్తం చేశారు అధికారులు.
ఈ క్రమంలో తిరుమల ఘాట్ రోడ్లపై బైకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఘాట్ రోడ్లపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి 55, 56వ మలుపు వద్ద బైక్‌పై వెళ్తున్న కొంతమందికి చిరుత కనిపించింది. భయాందోళనకు గురైన వాహనదారులు వెంటనే విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే భక్తులను అప్రమత్తం చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ ఆంక్షలు విధించింది.