Friday, November 22, 2024

Breaking | తప్పించుకు తిరుగుతున్న చిరుత చిక్కిందోచ్​.. భక్తులు భయపడక్కర్లేదు!

తిరుమల కాలిబాటలో భక్తులను భయాందోళనకు గురిచేస్తున్న చిరుతలను ఫారెస్ట్​ అధికారులు పట్టుకున్నారు. ఆపరేషన్​ చిరుత ప్రోగ్రామ్​లో భాగంగా ఇప్పటికే మూడు చిరుతలను బంధించగా.. నిన్న (ఆదివారం) రాత్రి నాలుగో చిరుతను కూడా పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. వారం రోజులుగా చిరుతలను ట్రాప్​ చేసేందుకు అటవీశాఖ చేస్తున ప్రయత్నాలు సక్సెస్​ అయ్యాయి. ఈ క్రమంలో ఫారెస్ట్​ ఆఫీసర్లను ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు బోనులోకి చిక్కింది.

కాగా, ఇన్ని రోజులు ట్రాప్​లో చిక్కకుండా బోను వరకు వచ్చినట్టే వచ్చి తప్పించుకుంటూ వస్తున్నది ఈ చిరుత. వివిధ రకాల వ్యూహాలు పన్ని ఆ చిరుతను ట్రాప్​ చేశారు. ఎట్టకేలకు నిన్న (ఆదివారం) రాత్రి 7వ మైలు వద్ద ట్రాప్ కి చిరుత చిక్కినట్టు తెలుస్తోంది. దీంతో నడకమార్గంలో సంచరిస్తు చిరుతలను అటవిశాఖ బంధించినట్టు సమాచారం. ఇక పై భక్తులుకు ప్రశాంతంగా నడకమార్గంలో వెళ్లొచ్చని, అయినా అప్రమత్తంగా ఉండడమే మంచిదని అధికారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement