AP | చీమకుర్తి సీఐ దుర్గా ప్రసాద్ సస్పెండ్

చీమకుర్తి, (ప్రభ న్యూస్) : చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ ను ఐజీ సస్పెండ్ చేశారు. అందిన సమాచారం ప్రకారం.. చీమకుర్తిలో జరిగిన ఒక దొంగతనం కేసులో ఉదాసీనంగా వ్యవహరిస్తూ సీఐ దుర్గాప్రసాద్ నిర్లక్ష్యం ప్రదర్శించారు. అయితే వారు అద్దంకిలో మరో దొంగతనం చేస్తూ దొరికిపోయారు. అక్కడ పోలీసుల‌ విచారణలో ఇక్కడ సీఐ దుర్గాప్రసాద్ గురించి పూసగుచ్చినట్లు సమాచారం అందించారు. దీనిపై విచారణ జరిపిన ఐజీ.. సీఐ దుర్గాప్రసాద్ ను సస్పెండ్ చేసినట్లు సమాచారం.

Exit mobile version