Friday, November 22, 2024

సాంకేతికతతో సమస్యలకు చెక్‌, డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌ రెడ్డికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

అనంతపురం, ప్రభ న్యూస్‌ బ్యూరో:సాంకేతికత సహాయంతో అనేక సమస్యలకు పరిష్కారం చూపించవచ్చని, అందువల్ల ఆ రంగంలో విద్యార్థులు పట్టు సాధించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. జేఎన్టీయూ 12వ స్నాతకోత్సవానికి చాన్సలర్‌ హోదాలో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరయ్యారు. శనివారం జేఎన్టీయూ వర్సిటీ- ప్రాంగణంలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు.స్నాతకోత్సవ కార్యక్రమాన్ని వీసీ రంగ జనార్ధన గవర్నర్‌ ఆమోదంతో స్నాతకోత్సవం ప్రారంభించారు. అనంతరం డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ (ఆర్‌ అండ్‌ డి) సెక్రెటరీ, డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌ రెడ్డికి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేశారు. అత్యున్నత ప్రతిభ కనబరిచిన 35 మంది విద్యార్థులకు గవర్నర్‌ గోల్డ్‌ మెడల్స్‌ అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ యువత నూతన ఆలోచనతో ముందుకు రావాలన్నారు. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్‌ కలామ్‌ మాటలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులు విస్తృతమైన పరిశోధనలు చేసి దేశ అభివృద్ధికి పాటుపడాలన్నారు.

స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ సభనుద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు -టె-క్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేవలం -టె-క్నాలజీ ద్వారానే దేశంలో పేదరికం, ఆకలి, అనారోగ్యం వంటి సామాజిక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమ్‌ నాథ్‌ పేర్కొన్నారు. ఒకప్పుడు ఆకలితో అలమటించిన దేశం అనంతరం -టె-క్నాలజీలో వచ్చిన మార్పుల కారణంగా హరిత విప్లవం ద్వారా గోధుమ ఉత్పత్తి పెంచి ఆకలిని జయించిందన్నారు. స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో సగటు- మనిషి జీవిత కాలం 30 ఏళ్లకు అటూఇటు-గా ఉండేదని, వైద్యరంగంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అది దాదాపు 70 ఏళ్లకు చేరుకుందన్నారు. -టె-క్నాలజీ అభివృధ్ధిలో విద్యార్థులు భాగస్వాములై దేశాభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి, పాఠశాల విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సెక్రటరీ ఆలూరి సాంబ శివా రెడ్డి, మాజీ మంత్రి వర్యులు పల్లె రఘునాథ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement