అమరావతి, ఆంధ్రప్రభ : రేషన్ పంపిణీ విధానంలో మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఇప్పటివరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు బయోమెట్రిక్ (వేలి ముద్రలు) ఆధారం గా రేషన్ పంపిణీ చేస్తుంది. ఇప్పటివరకూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తూ వస్తున్న సర్కార్ ఇప్పుడు ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకొంది. నెలవారీ లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నా రాష్ట్రం లో పలు చోట్ల వేలి ముద్రల సమస్య ఎదురవుతుంది.
ప్రతీ నెలా వేల సంఖ్యలో లబ్ధిదారులు రేషన్ తీసుకోకుండానే వెను తిరగాల్సిన పరిస్థితి నెలకొంది ఈ సమస్య తీవ్ర ను గుర్తించిన ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఆవేదన చెందుతున్న లబ్దిదారులకు భారీ ఊరట ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకుంది.ఇప్పటివరకు రేషన్ పంపిణీ లో ఉన్న వేలిముద్రల స్థానంలో ఐరిష్ (కంటి గుర్తింపు) విధానం అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాలశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల అంటే జూన్ నుంచి ఈ కొత్త విధానంలో రేషన్ పంపిణీ చేయనున్నారు.
ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు..
ప్రస్తుతం ఏపీలో రేషన్ పంపిణీ కోసం లబ్దిదారుల వేలి ముద్రలు ప్రామాణికం గా తీసుకుంటు-న్నారు. ఈ విధానం వల్ల పేదలు పలు ఇబ్బందులు పడుతున్నారు. దినసరి కూలీ లు , ఇతర చేతి వృత్తుల పేదలు వేలి ముద్రలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. బయోమెట్రిక్ ద్వారా మెషీన్ లో వేలిముద్రలు పడక గంటల కొద్ది నిరీక్షించినా ఫలితం లేని పరిస్దితి. వేలి ముద్రలు పడకపోవడం తో రేషన్ ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. వారి నుంచి పదే పదే రేషన్ అందడం లేదనే ఫిర్యాదులు పెరుగుతున్న తరుణంలో ఈ ఇబ్బందులు నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతి కి నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐరిష్ ఆధారిత ధ్రువీకరణతో రేషన్ పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తో వేలిముద్రలు పడని లబ్ధిదారులకు భారీ ఊరట కలగనుంది.
జూన్ నుంచి ఐరిష్ ద్వారా రేషన్..
ఏపీలో ఐరిష్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణ ద్వారా నిత్యావసరా లను పంపిణీ చేయను న్నట్టు- పౌరసరఫరాల ప్రకటించింది. ఇప్పటివరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పోస్ యంత్రంలో లబ్ధిదారుల వేలిముద్రలను ధ్రువీకరించి రేషన్ అందిస్తున్నామని, రోజువారి కూలీలు, వృద్ధులు, పలు వ్యాధిగ్రస్తులకు వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటు-న్నట్లు- ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపింది.ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఇకపై వేలిముద్రలు పడని వారికి ఐరిష్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణ ద్వారా రేషన్ పంపిణీ కి ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించింది.
9260 వాహనాల్లో ఐరిష్ పరికరాలు..
రేషన్ లబ్ధిదారుల ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,260 ఎండీయూ వాహనాల్లో కొత్తగా ఐరిష్ (కంటి) పరికరాలను అమర్చనుంది.జూన్ నెల నుండి వేలిముద్రలతో పాటు- ఐరిస్ ఆధారిత ధ్రువీకరణను ప్రామాణికంగా తీసుకుని నిత్యావసరాలు, బియ్యం పంపణీ చేయనున్నారు.