ఫిరంగిపురం, (ప్రభ న్యూస్) : మండలంలోని పోనుగుపాడు గ్రామంలో ఉంటున్న నిడమానూరు భీమేశ్వరరావు, సుబ్బాయమ్మ దంపతులు వారి కొడుకు, కోడలు అయిన శివ ప్రసాద్, పుష్ప అలేఖ్య అను వారు సుమారు 12 సంవత్సరాల నుండి పొనుగుపాడు గ్రామంలో ఎంతో నమ్మకంగా ప్రజలను నమ్మిస్తూ చీటీ పాటలు వేసేవారు. అలాగే రైతుల వద్ద డబ్బు అప్పుగా తీసుకుని ఎక్కువ వడ్డీ ఇచ్చే వారు.
సుమారు గ్రామ ప్రజల వద్ద రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల వరకు చీటీల తాలూకు, వడ్డీ తాలూకా డబ్బులు వసూలు చేసుకుని సుమారు 6 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి పరారైనట్లు గ్రామ ప్రజలు గ్రహించి స్థానిక ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వి.అజయ్ బాబు పొనుగుపాడు గ్రామం వెళ్లి జరిగిన సంఘటనపై విచారించి చీటీ పాటలు వేసి జనాన్ని మోసం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఫిరంగిపురం తెలిపారు. పరారీలో ఉన్న వారిని తొందరలోనే పట్టుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్.ఐ హామీ ఇచ్చారు. ఇంకా ఎవరైనా మోసపోయిన వారుంటే ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో తెలపాలని ఎస్ఐ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital