‘‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. కందుకూరు సభా ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటికి ఎనిమిది మంది కార్యకర్తలు చనిపోయారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఈ తొక్కిసలాటలో చాలామంది ఒక్కసారిగా కాల్వలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మొదటి ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత మరో ఆరుగురు మృతిచెందినట్టు సమాచారం అందుతోంది. కాగా, బాధితులను చంద్రబాబు హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఒక్కో ఫ్యామిలీకి పది లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందివ్వనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.
సభకు పక్కనే కాల్వ ఉండడం.. ఈ క్రమంలో సభకోసం వస్తుండగా తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. దీంతో చాలామంది కార్యకర్తలు కాల్వలో పడిపోయినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
updates are continuous.. follow our website https://www.prabhanews.com/