అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో 7, 10 తరగతులు చదివే విద్యార్ధులకు నిర్వహించనున్న ఈఈఎమ్టి పరీక్షల తేదీలలో మార్పులు చేసినట్లు ఎపిఫని ఎడ్యుకేషన్ సంస్థ కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామ చంద్ర మూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుండగా పొడిగిస్తూ ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 23, 31 తేదీలలో జరుగవలసిన ప్రిలిమినరీ పరీక్షలను పిభ్రవరి 1వ తేదీకి, మెయిన్స్ పిభ్రవరి 8వ తేదీకి మార్పు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్ధులకు నగదు బహుమతులను అందజేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement