Tuesday, November 26, 2024

AP: టెట్ షెడ్యూల్‌లో మార్పులు…

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (AP TET) షెడ్యూల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టెట్‌ షెడ్యూల్‌లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

జులై 2న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ జరగాల్సి ఉండగా, ఆ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపింది. ప్రిపరేషన్‌కు సమయం కోసం అభ్యర్థుల వినతి మేరకు సవరణ నోటిఫికేషన్‌ను ఇవాళ రిలీజ్ చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

ఏపీ టెట్ రివైజ్డ్‌ షెడ్యూల్‌ ఇదే :
ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల : జులై 2, 2024
పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం : జులై 3, 2024
పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరితేది: ఆగస్టు 3, 2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 3, 2024
ఆన్‌లైన్‌ మాక్‌టెస్ట్‌: సెప్టెంబర్‌ 19 నుంచి అందుబాటులోకి
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: జులై 22 నుంచి
ఏపీ టెట్‌ పరీక్షలు: అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు
ప్రొవిజినల్‌ కీ : అక్టోబర్‌ 4, 2024
ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: అక్టోబర్‌ 5 నుంచి
ఫైనల్‌ కీ విడుదల: అక్టోబర్‌ 27, 2024
ఫలితాలు విడుదల: నవంబర్‌ 2, 2024

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement