శ్రీహరికోట – భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన ఉపగ్రహం ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతున్నది. ఇస్రో క్రమక్రమంగా ఇంజిన్‌ను మండించి కక్ష్యను పెంచుకుంటూ వెళ్తున్నది. ఇప్పటి వరకు మూడుసార్లు చంద్రయాన్-3 కక్ష్యను పెంచగా.. గురువారం నాల్గోసారి ఉపగ్రహం కక్ష్య (ఎర్త్ బౌండ్ ఆర్బిట్ మాన్యువర్)ను పెంచింది.
ఈ నెల 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య మరోసారి ఇంజిన్‌ను మండించి కక్ష్యను పెంచనున్నది. ప్రస్తుతం చంద్రయాన్-3 ఉపగ్రహం 51400 కిమీ x 228 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలో ఉన్నది. ఇక చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ వచ్చే నెల 5 నాటికి చంద్రుడి కక్షలోకి చేరుకుంటుందని ఇస్రో వర్గాలు పేర్కొంటుండగా.. ఆగస్టు 23, 24 వరకు చంద్రుడిపై ల్యాండ్ చేయనున్నది.