నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుంచి చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్ -3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్తోంది. చంద్రయాన్-3 ని శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. చంద్రయాన్ -3 బరువు 3900 కిలోలు. చంద్రయాన్ -3 ల్యాండర్, రోవర్ ను రాకెట్ మోసుకెళ్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణం 40 రోజుల పాటు సాగనుంది.
24 రోజుల పాటు భూకక్ష్యలో తిరుగుతూ చంద్రుని దిశగా గమనం ప్రారంభించి చంద్రుని కక్ష్యలోకి చేరిన తర్వాత 19 రోజుల పాటు పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆగస్టు 20 తేదీ తర్వాత చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న ఉపగ్రహం నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయి చంద్రుని దక్షిణ ధృవంలో దిగనుంది. చంద్రునిపై ల్యాండర్ దిిగిన తర్వాత అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుడిపై 14 రోజుల పాటు సంచరిస్తూ అక్కడి వాతావరణ పరిస్థితులను, ఖనిజ నిక్షేపాలను అన్వేషించనుంది. దీంతో చంద్రుని గురించి సరికొత్త సమాచారం లభించనుంది. భారతదేశంతో పాటు యావత్ ప్రపంచం ఈ ప్రయోగం పై ఉఠ్కంత నెలకొంది.
2008లో చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆ తర్వాత చంద్రయాన్ -2 ప్రయోగంలో ల్యాండర్ చంద్రుని ఉపరితలంలో దిగే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి భూమి నుంచి ల్యాండర్‌కు సంకేతాలు తెగిపోవడంతో చంద్రుని ఉపరి తలాన్ని ఢీకొట్టడంతో ప్రయోగం విఫలమైంది. దీంతో చంద్రుని ఉపరితలంపై ఆశించిన పరిశోధనలు ఇస్రో చేయలేకపోయింది. ప్రస్తుతం చేపడుతున్న చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.