నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం కొత్త ఈఓగా చంద్రశేఖర్ ఆజాద్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ ఆజాద్ కలిశారు.
దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు నూతన ఈఓగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ ఆజాద్… ఆదివారం మంగళగిరిలో ఎమ్మెల్యేతో సమావేశమై శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి చేపట్టాల్సిన భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఈఓకు సూచించారు.