99 హామీల అమలు బూటకం
ఐదేళ్ల పాలనలో విధ్వంసం.. దోపిడీ
విశ్వసనీయత ఓ నాటకం
మళ్లీ జనాన్ని మోసం చేయటానికే సిద్ధం
(ఆంధ్రప్రభ, అమరావతి) : 99శాతం హామీల అమలు అనేది సీఎం జగన్ బూటకం మాటలని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. జగన్ ప్రతిపక్ష నేతగా నాడు ఇచ్చిన 99 హామీలను ప్రస్తావిస్తూ… మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న జగన్ రెడ్డి తన గత హామీలపై బదులిచ్చాకే మళ్లీ బస్సెక్కాలి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
5ఏళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు, కక్షా రాజకీయాలకు, దోపిడీకి వెచ్చించిన ఏకైక సీఎం జగన్ రెడ్డి. 99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకం… విశ్వసనీయతపై అతని కబుర్లు అతిపెద్ద నాటకం, మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్న నువ్వు… ముందు నీ గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కు జగన్ ! అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. హామీలు నెరవేర్చి ఓట్లు అడగటానికి వస్తా అన్నావు, ఏముఖం పెట్టుకుని ప్రజలలోకి వెళ్తావ్ జగన్, పరదాలు ఉంటే నీకేంటీ. అని నారా లోకేష్ పోస్టింగ్ ను చంద్రబాబు రీ ట్వీట్ చేశారు.