Monday, November 18, 2024

Chandrababu’s Skill Case – హైకోర్టు క్వాష్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్….రేపు ప‌రిశీలించే అవ‌కాశం

న్యూఢిల్లీ – స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు. చంద్రబాబు నాయుడు తరుపున సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన తరఫు న్యాయవాది సిదార్థ్ లూత్రా సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ టిడిపి అధినేత చంద్రబాబు ఎన్ని రోజుల నుంచి రిమాండ్‌లో ఉన్నారని ప్రశ్నించారు.

ఇందుకు బదులిచ్చిన లూత్రా.. ఈ నెల 8న చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు. ఇక, చంద్రబాబు పిటిషన్‌పై రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని చంద్రబాబు న్యాయవాదులకు జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈరోజు మెన్షన్ జాబితాలో చంద్రబాబు పిటిషన్ లేనందున విచారణ జరిపేందుకు సీజేఐ నిరాకరించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఎప్పుడూ జరగనుందనేది రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement