Saturday, January 4, 2025

AP | ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..

  • మద్యం షాపుల యజమానులకు భారీగా కమీషన్ పెంపు
  • గీత కులస్తులకు 10 శాతం రిజర్వేషన్ తో షాపుల కేటాయింపు
  • టెక్నాలజీ సాయంతో మద్యం విక్రయాలపై నిఘా
  • బెల్ట్ షాపులపై కఠిన వైఖరి

రాష్ట్రంలోని మద్యం షాపుల యజమానులకు కూట‌మి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎక్సైజ్ శాఖ‌పై స‌మీక్ష స‌మావేశం జరిగింది. ఈ సందర్భంగా మద్యం షాపు యజమానులకు ఇచ్చే కమీషన్‌ను 10 నుంచి 14 శాతానికి పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం దుకాణాలు ఉండగా, అందులో 10 శాతం మద్యం షాపులను గీత‌ కులాలకు కేటాయించాలని నిర్ణ‌యించారు. 340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

మద్యంతో పాటు అన్ని బ్రాండ్లను రూ.99కే అందుబాటులోకి తేవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అదే సమయంలో రాష్ట్రంలో బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. టెక్నాలజీ ద్వారా మద్యం విక్రయాలను ట్రాక్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement