Tuesday, November 26, 2024

బాధితులకు సత్వర న్యాయం చేయాలి.. రమ్య హంతకుడికి ఉరిశిక్షపై చంద్రబాబు రెస్పాన్స్​

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు సిటీలో ప‌ట్ట‌ప‌గ‌లు, న‌డిరోడ్డుపై బీటెక్ స్టూడెంట్​ ర‌మ్య‌ను క‌త్తితో పొడిచి హతమార్చిన నిందితుడు శ‌శికృష్ణ‌కు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు ప్ర‌త్యేక కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ తీర్పుపై టీడీపీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. గత స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్ధిని రమ్యను పట్టపగలు నడిరోడ్డుపై చంపిన ఉన్మాదికి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. అదే మాదిరిగా ఈ మూడేళ్లలో జరిగిన 800కు పైగా ఘటనల్లో కూడా బాధిత కుటుంబాలకు త్వరగా న్యాయం దక్కాలని కోరుకుంటున్న‌ట్లు చంద్ర‌బాబు తెలిపారు.

కాగా, రంజాన్​ పవిత్ర మాసం సందర్భంగా ఇవ్వాల గుంటూరులొో ఏర్పాటుచేసిన ఇప్తార్ విందులో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యేకమైన డ్రెస్​ వేసుకుని అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబుతోపాటు ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement