Tuesday, November 26, 2024

అక్రమ మైనింగ్ పై.. ఏపీ గవర్నర్ కు చంద్రబాబు లేఖ

కుప్పం ద్రవిడ వర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతుందని దీనిపై చర్యలు తీసుకోవాలని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పర్యావరణ విధ్వంసంతో పాటు వన్యప్రాణులు చనిపోతున్నాయని పేర్కొన్నారు. వర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్ ను అడ్డుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అక్రమ మైనింగ్‌కు ద్రవిడ యూనివర్సిటీ హబ్‌గా మారిందని వెల్లడించారు. వర్సిటీకి చెందిన 1100 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ కొనసాగిస్తున్నారని లేఖలో వివరించారు. బ్లాస్టింగ్‌, అక్రమ రవాణాతో వన్యప్రాణులు చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ పక్షి నెమళ్లతో పాటు అరుదైన జంతుజాలం నశిస్తోందని తెలిపారు. ఆహారంలోనూ నాణ్యత లోపించి ఇటీవల వందల మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement